ఎన్నో సూపర్ హిట్ పాటలు ప్రపంచానికి అందించిన ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీకి మరిన్ని సూపర్, డూపర్ హిట్ లను అందించేందుకు, మ్యూజిక్ లవర్స్ ను అలరించేందుకు మరోకరు రాబోతున్నారు. అది ఎవరో కాదు రెహమాన్, సైరా బానుల పెద్ద కూతురు ఖతీజా రెహమాన్. పలు ఆసక్తికరమైన పాటలతో కోక్ స్టూడియో ద్వారా అరంగేట్రం చేసిన ఆమె.. ఇప్పటికే సంగీత ప్రియుల ప్రశంసలను అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కూడా తన తండ్రిలా ఫుల్ టైమ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారేందుకు సిద్ధమవుతున్నారు.
‘సిల్లు కారుపట్టి’ ఫేమ్ హలిత షమీమ్ దర్శకత్వం వహించిన తమిళ సనిమా ‘మిన్మిని’తో ఖతీజా రెహమాన్ సంగీత దర్శకురాలిగా అరంగేట్రం చేయడానికి ఖతీజా సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా మూవీ దర్శకుడు ఆమెను సోషల్ మీడియా ద్వారా సినీ ప్రేక్షకులకు పరిచయం చేశారు. రికార్డింగ్ స్టూడియోలో ఖతీజాతో కలిసి ఉన్న చిత్రాన్ని పంచుకున్నారు, “మిన్మిని కోసం అసాధారణ ప్రతిభ గల ఖతీజా రెహమాన్‌తో కలిసి పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అంటూ ఆమె పేర్కొన్నారు. కాగా మిన్మినీలో ఎస్తేర్ అనిల్, హరి కృష్ణన్, గౌరవ్ కలై , ప్రవీణ్ కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.మణిరత్నం ఎపిక్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్: II’ లో AR రెహమాన్ కూతురు ఖతీజా ఇప్పుడు తన తండ్రి, సోదరుడు అమీన్ అడుగుజాడల్లో నడుస్తుండడంపై ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కంపోజింగ్ ప్రపంచంలోకి ప్రవేశిస్తోన్న ఖతీజాకు నెటిజన్లు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.2010లో తెరకెక్కిన ఎస్ శంకర్ చిత్రం ‘ఎంథిరన్’లో ప్లేబ్యాక్ సింగర్‌గా ఖతీజా అరంగేట్రం చేసింది. ఆమె రెహమాన్, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ‘పుతియ మనిధ’ పాటకు తన గాత్రాన్ని అందించింది.
ఘనంగా వి. మధుసూదనరావు శతజయంతి వేడుకలు
ఆ తర్వాత మరో ఆరు సినిమాల్లోనూ పాటలు పాడింది. ఇవన్నీ విపరీతమైన ప్రజాదరణ పొందాయి. ఇప్పుడు మ్యూజిక్ కంపోజర్ గా ప్రేక్షకులను అలరించబోతున్న ఖతీజా సంగీతం కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తండ్రి ఏఆర్ రెహమాన్ కంపోజింగ్ లోనూ తన కూతురు ఖతీజా రెహమాన్ పలు సినిమాల్లో పాటలు పాడి మంచి స్వరకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. వాటిలో ఎంథిరన్ రొబోట్(2010), మిమీ(హిందీ చిత్రం – 2021), ఇరవిన్ నిజల్ (2022), మిలి(హిందీ చిత్రం – 2022), పొన్నియన్ సెల్వన్ పార్ట్ – 2 వంటి చిత్రాల్లో ఖతీజా పాటలు పాడి, తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకున్నారు.