Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

నేను దోషిని కాదు.. ట్రంప్ అరెస్ట్ విడుదల..

0

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం మరోసారి మియామిలోని ఫెడరల్‌ కోర్టు ముందు హాజరయ్యారు. అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత అధికారిక రహస్యాలున్న పత్రాలను వెంట తీసుకెళ్లాడని అభియోగాలను ఎదుర్కొన్నారు. తన ఇంట్లో ఆ పత్రాలను దాచిపెట్టుకున్నారనే ఆరోపణలపై ట్రంప్ పై కేసు నమోదైంది. లాంఛనంగా అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ట్రంప్‌ను హాజరుపరిచారు. దీంతో అమెరికా చరిత్రలోనే నేరారోపణలు ఎదుర్కొంటూ కోర్టుకు హాజరైన తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్  నిలిచిపోయారు.ఫ్లోరిడాలోని తన ఎస్టేట్‌లో ట్రంప్‌ నిబంధనలకు విరుద్ధంగా అధికారిక రహస్య పత్రాలను దాచారని అభియోగాలను ట్రంప్ తిరస్కరించారు.

 

ఈ కేసులో ట్రంప్ అరెస్టుకు ఆదేశాలు వెలువడతాయనే ప్రచారం జరిగింది. అయితే ఎలాంటి షరతులు లేకుండానే ఆయన కోర్టు నుంచి బయటకు వెళ్లిపోయారు. ట్రంప్ కోర్టు నుంచి బయటకు వచ్చిన తరువాత ఒక క్యూబన్ రెస్టారెంట్లో తన మద్దతుదారులతో కలిసి సరదాగా గడిపారు ట్రంప్.జనవరి 2021లో ట్రంప్ వైట్‌హౌస్‌ను విడిచిపెట్టినప్పుడు.. పెంటగాన్, CIA, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, ఇతర ఇంటెలిజెన్స్ బాడీల నుంచి అత్యంత సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉన్న రహస్య ఫైళ్లను తన వెంట తీసుకెళ్లాడని న్యాయ శాఖ పేర్కొంది.

 

స్కై న్యూస్ ప్రకారం, ట్రంప్ ఇంటెలిజెన్స్ సమాచారంతో కూడిన పత్రాలను షవర్, బాల్రూమ్‌లో ఉంచారు.పత్రాల బాక్సులను తన మార్-ఎ-లాగో ఎస్టేట్‌కు తరలించడంలో ట్రంప్ స్వయంగా పాల్గొన్నారని ఆరోపణలు వచ్చాయి. అంతర్జాతీయ మీడియా సంస్థలు అందించిన సమాచారం ప్రకారం, ట్రంప్ నివాసం నుండి FBI స్వాధీనం చేసుకున్న అత్యంత రహస్య రికార్డులలో విదేశీ దేశం అణు సామర్థ్యాల వివరాలు ఉన్నాయి.జూన్ 10న ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన నేరారోపణ ప్రకారం, ట్రంప్ తన మార్-ఎ-లాగో నివాసం, క్లబ్‌లో పత్రాలను సురక్షితంగా ఉంచలేదు. ఇది క్రమం తప్పకుండా వేలాది మంది అతిథులను ఈవెంట్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. పత్రాలను అనధికారికంగా బహిర్గతం చేయడం వల్ల అమెరికా జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుందని ఆరోపణలు పేర్కొన్నాయి.

బిపర్‌జాయ్ తుఫాన్ ఉగ్రరూపం.

బైడన్ కు భయం పట్టుకుంది
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌…బైడెన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. “జో బైడెన్ పెద్ద అవినీతి పరుడు” అంటూ విమర్శించారు. అమెరికా చరిత్రలోనే అధ్యక్షుడి పదవిని ఇంతలా దుర్వినియోగపరుస్తున్న నేత ఇంకెవరూ లేరని మండి పడ్డారు. సీక్రెట్ డాక్యుమెంట్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్…ఇలాంటి కామెంట్స్ చేయడం కీలకంగా మారింది. తనపై కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయపోరాటం కూడా మొదలు పెట్టారు. మియామిలోని ఫెడరల్ కోర్టులో తనపై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. వచ్చే ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

 

ఈ రేసులో తాను కూడా ఉన్నట్టు ఇప్పటికే ప్రకటించారు ట్రంప్. ప్రెసిడెంట్‌ పదవికి పోటీ పడుతున్న ట్రంప్‌ని చిక్కులు వెంటాడుతున్నాయి. వరసగా ఏదో ఓ కేసులో ఇరుక్కుంటున్నారు. “అధికారాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారో చెప్పడానికి ఇదే ఉదాహరణ. అమెరికా చరిత్రకే ఇది కళంకం తెచ్చి పెట్టింది. ఎంతో బాధగా ఉంది. అవినీతి పరుడైన వ్యక్తి (బైడెన్‌ని ఉద్దేశిస్తూ) అధ్యక్ష పదవిలో ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థినైన నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఓడిపోతాననే భయం పట్టుకుంది. అందుకే ఇలా నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు.

 

ఇంత కన్నా దారుణంగా ఇంకేదీ ఉండదు” ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్ న్యాయపోరాటం చేయగా..విదేశీ పర్యటనలపై ఉన్న ఆంక్షలు తొలగించింది ఫెడరల్ కోర్టు. అయితే..ఈ కేసుల్లో సాక్షులుగా ఉన్న వారితో ఎలాంటి కమ్యూనికేషన్ ఉండకూడదని తేల్చి చెప్పింది. ఈ వ్యాఖ్యలు చేయగానే..కోర్టులోని ట్రంప్ మద్దతుదారులంతా “We Love Trump” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ చుట్టూ మరో ఉచ్చు బిగుస్తోంది. నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన కీలక డాక్యుమెంట్స్‌ని ట్రంప్ తన వద్దే అనధికారికంగా వాటిని దాచి పెట్టుకున్నాడన్న ఆరోపణలు వచ్చాయి.

బడుగు, బలహీన వర్గాలకోసం పలు కేంద్ర పథకాలు బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతం.

దీనిపై ఇప్పటికే ఆయనపై కేసు నమోదైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తరవాత వైట్‌హౌజ్‌ని ఖాళీ చేసి వెళ్లే సమయంలో కొన్ని కీలక పత్రాలను ట్రంప్ తనతో పాటు తీసుకెళ్లాడన్నది ప్రధాన ఆరోపణ. ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో (Mar-a-Lago)రిసార్ట్‌లో వాటిని దాచి పెట్టినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. ఇదే విషయాన్ని స్వయంగా ట్రంప్ వెల్లడించారు. తనపై కేసులు పెట్టినట్టు చెప్పారు. అధికారులు ఇప్పటికే ఆయన రిసార్ట్‌లో సోదాలు నిర్వహించారు. కొన్ని కీలక పత్రాలు దొరికాయి. వాటిని వైట్‌హౌజ్‌కి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ట్రంప్ అడ్డుకున్నారని పోలీసులు వెల్లడించారు. అయితే…ట్రంప్ మాత్రం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు. మియామి ఫెడరల్‌ కోర్టులో హాజరు కావాలని తనకు సమన్లు జారీ చేశారని చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడిపై ఇలాంటి ఆరోపణలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదని ట్రంప్ తన Truth Social సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie