కండువా వేసి కాంగ్రెస్ ఆహ్వానించిన డీసీసీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి
పాపన్నపేట మండలం గాంధారి పల్లి మాజీ సర్పంచ్ ఎండుగుల విట్ఠల్ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రేస్ పార్టీలో చేరారు. గురువారం గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మోసపూరిత హామీల నుండి ప్రజలు బయట పడుతున్నారన్నారు. రాబోయే 2 నెలల్లో నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు, ఎల్లపూర్ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంతప్ప, గోవింద్ నాయక్, శ్రీనివాస్, సతీష్ శ్రీకాంత్ రెడ్డి, సంజీవ రెడ్డి, జనార్దన్ రెడ్డి, నర్సింలు, నాగరాజు, జగన్ రెడ్డి, సిద్ధ రెడ్డి, కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prev Post