Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వరదలు… కష్టాలు

Floods hardships

0

రంగ్ంలోకి దిగుతున్న ఎన్ డీ ఆ ఎఫ్ బృందాలు
ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని ముత్యంధార జలపాతాల సందర్శనకు వెళ్లిన 82 మంది పర్యాటకులు ఊహించని ఆపదలో చిక్కుకున్నారు.. 8 గంటల పాటు కారడివిలో, కుండపోత వర్షంలో ఆహాకారాలు చేశారు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపిన పర్యాటకులు చివరకు ఎన్ డీ ఆ ఎఫ్ బృందాలు, పోలీసులు సాహసంతో మృత్యుంజయులయ్యారు. సెలవు దినం కావడంతో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు పర్యటకులు ములుగు జిల్లాలోని జలపాతాల సందర్శనకు వెళ్లారు.. వారిలో కొందరు వీరబద్రవరం గ్రామ సమీపంలోని ముత్యంధార జలపాతాల సందర్శన కోసం వెళ్లారు.. అక్కడ జలపాతాల్లో జలకాలాడి ఫుల్ గా ఎంజాయ్ చేశారు.. కానీ ఆ పర్యాటకులు తిరుగు ప్రయాణంలో ఊహించని ఆపదలో చిక్కుకున్నారు.. మార్గ మధ్యలో గగ్గేని వాగు ఉప్పొంగింది.. మధ్యలో మరో రెండు కాలువలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.. దీంతో పర్యాటకులు అడవిలో చిక్కుకున్నారు.

దిక్కుతోచని స్థితిలో ఆహాకారాలు చేశారు. మొత్తం 82 మంది అడవిలో చిక్కుకోగా వారిలో కేవలం ఇద్దరి సెల్ ఫోన్లు మాత్రమే పనిచేశాయి. ఈ క్రమంలో అడవిలో ఆపదలో చిక్కుకున్న విషయాన్ని మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇతర ఉన్నతాధికారులకు తెలియజేశారు. వారి ఫ్రెండ్స్ కు తెలియ పర్చారు.. ఈ క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది.. ఎన్ డీ ఆ ఎఫ్  బృందాలను రంగంలో దింపారు.. జిల్లా కలెక్టర్,  SP అర్ధరాత్రి వరకు అక్కడే వుండి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.. కుండపోత వర్షంలో అతికష్టం మీద ఎన్ డీ ఆ ఎఫ్  బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి.

మార్గమధ్యలో వరద ఉప్పొంగి ప్రవహిస్తున్న రోప్ సహాయంతో అడవిలోకి వెళ్లి వారిని కాపాడారు.82 మందిని సురక్షితంగా వీరభద్రవరం చేర్చారు.. వారికి అక్కడ భోజనాలు ఏర్పాటుచేసి తిరిగి స్వగ్రామాలకు పంపారు.. వారిని కాపాడడం కోసం కృషిచేసిన మంత్రులకు వారు కృతజ్ఞతలు తెలిపారు..ప్రాణాలు తెగించి వారి కాపాడిన గ్రామస్తులు, ఎన్ డీ ఆ ఎఫ్  బృందాలు, పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. అడవిలో ఎనిమిది గంటలపాటు నరకం అనుభవించామని గుర్తు చేసుకుంటూ నవైద్వెగానికి లోనయ్యారు.. ఇది మాకు పునర్జన్మన్నారు. మొత్తం మీద ఆపరేషన్ సక్సెస్ అయి ఆ 82 మంది సురక్షితంగా బయట పడడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు.

 మంచిర్యాలలోఆరుగురు
ఐకమత్యమే మహాబలం అన్న మాటను‌ అక్షరాల నిజం చేశారు ఆ కార్మికులు. భారీ వర్షాలతో వరద ఉదృతి పెరగడంతో త్వరగా ఇళ్లు చేరాలన్న ఆతృతతో ఉదృతితో పారుతున్న వాగును‌దాటే ప్రయత్నం చేశారు ఆరుగురు వ్యక్తులు. కానీ వాగు వరద ప్రవాహం మరింత పెరగడంతో వరదలో చిక్కుకున్నారు. వరద ఉదృతికు కొట్టుకుపోయే ప్రమాదంలో ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఐక్యమత్యంతో బతుకు‌ జీవుడా అంటూ ఒడ్డు చేరారు. ఈ ఘటన మంచిర్యాల జైపూర్ మండలం పెగడపల్లి‌వద్ద చోటు‌ చేసుకుంది. జైపూర్ ఎన్టీపీసీ ప్లాంటులో విధులు నిర్వహిస్తున్న పెగడపల్లికి చెందిన ఆరుగురు కార్మికులు డ్యూటీ ముగించుకుని సాయంత్రం ఇంటికి బయలు దేరారు. అదే సమయంలో పెగడపల్లి వాగు కు వరద పోటెత్తింది.నిత్యం‌ రాకపోకలు సాగించే వాగే కావడంతో ధైర్యంగా ఆరుగురు వాగు దాటే ప్రయత్నం చేశారు. మధ్యలో వెళ్లగానే వరద ఉదృతి పెరగడంతో ఇద్దరు కార్మికులు వరదలో కొద్ది దూరం కొట్టుకు పోయారు. వెంటనే అలర్ట్ అయిన మిగిలిన కార్మికులు వరదలో కొట్టుకుపోతున్న కార్మికులను గట్టిగా పట్టుకుని కాపాడారు. వరద ఉదృతి అంతకంతకు పెరగడంతో ముందుకు వెళ్లలేమని నిర్ణయించుకున్న ఆరుగురు కార్మికులు ఒకరి చేతులు‌ ఒకరు పట్టుకుని జాగ్రత్తగా తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. ఎట్టకేలకు ఒడ్డుకు చేరి ప్రాణాలు కాపాడుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie