ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫ్లెక్సీల వార్ మొదలయ్యింది. స్థానికం గా పలు చోట్ల పేదలకీ, పెత్తందారులకీ మధ్య యుద్ధం పేరిట ఆదివారం అర్థరాత్రి వైసీపీ ఫ్లెక్సీలు ఎర్పాటు చేశారు. అందులో పవన్ కల్యాణ్ను పల్లకీ మోస్తున్నట్టు గా చూపారు. సమాజంలో అశాంతినీ కలిగించే విధంగా వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందని జనసేన ఆందోళన వ్యక్తం చేసింది. వైసీపీ ఎర్పాటు చేసిన ఫ్లెక్సీలకి ధీటుగా జనసేన పార్టీ వైసిపి వ్యతిరేకంగా ఒంగోలులో ఫ్లెక్సీ ల లో “రాక్షస పాలనకి అంతం- ప్రజా పాలనకి ఆరంభం” అంటూ జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటుచేసింది. జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో జగన్ ఒక చేతిలో గొడ్డలి ..మరో చేతిలో వైయస్ వివేకానంద రెడ్డి తల. ఉన్నాయి. దుష్ట శక్తులపై విల్లు ఎక్కుపెట్టినట్లు పవన్ కళ్యాణ్ ఫొటో ఉంది..దీనితో ఒంగోలు లో వైసీపీ జనసేన ల మధ్య ఫ్లెక్సీల వార్ ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటాయో చూడాలి..