Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మదనపల్లెలో ప్రైవేటు కళాశాల మహిళా లెక్చరర్ దారుణ హత్య

Female lecturer of private college brutally murdered in Madanapalle

0
  • ద్విచక్రవాహనంలో వచ్చి
  • హతమార్చిన దుండగులు
  • కత్తి, వాహనం అక్కడే విడిచిపెట్టి పరారైన నిందితులు
  • టూటౌన్ పోలీసుల కేసు దర్యాప్తు

ప్రైవేటు కళాశాల మహిళా లెక్చరర్ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన గురువారం మదనపల్లెలో చోటు చేసుకుంది. పట్టణంలోని వైయస్సార్ కాలనీకి చెందిన ఖదీర్అహ్మద్ భార్య రుక్సానా(29)మదనపల్లెలోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం విధులు ముగించుకుని ద్విచక్రవాహనంలో ఇంటికి వెళ్తుండగా దారిలో ప్రశాంతనగర్ సమీపంలో గుర్తుతెలియని దుండగులు ద్విచక్రవాహనంలో వచ్చి ఆమెను ఢీకొట్టారు. అనంతరం కింద పడిపోయాక కత్తితో పొడిచి హత్య చేశారు. గమనించిన స్థానికులు ఘటనపై టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ కేశప్ప, సీఐ మురళీకృష్ణలు సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. విషయం తెలుసుకున్న రుక్సానా కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు.

కాగా రుక్సానాకు 18 నెలల కుమార్తె ఉంది. రుక్సానాకు పిల్లలు పుట్టకపోవడంతో ఖదీర్ అహ్మద్ కొద్దిరోజుల కిందట మదనపల్లెలోని అవంతి థియేటర్ ఏరియాకు చెందిన అయేషాను రెండో వివాహం చేసుకున్నాడు. అనంతరం దంపతులకు కాపురంలో మనస్పర్ధలు రావడంతో అయేషా అలిగి పుట్టింటికి వెళ్ళిపోయి భర్తపై వరకట్నం కేసు పెట్టింది. ఇదిలావుండగా అయేషా కుటుంబ సభ్యులు రుక్సానాపై కక్ష పెంచుకున్నారు. ఈమెకు ఆడబిడ్డ పుట్టిందని ఎలాగైనా హతమార్చాలని పథకం పన్నారు.

దీంతో కొద్దిరోజులుగా ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇందులోభాగంగా అయేషా కుటుంబ సభ్యులు గురువారం పథకం ప్రకారం రుక్సానాను హత్య చేశారు. అయేషా కుటుంబ సభ్యులే తన భార్యను హత్య చేశారని ఖదీర్ అహ్మద్ ఆరోపించాడు. గతంలో పలుమార్లు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని వాపోయాడు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్యను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. సంఘటనా స్థలంలో పడి ఉన్న కత్తి, ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie