Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మచిలీపట్నంలో మహిళా వైద్యురాలి హత్య

Female doctor murdered in Machilipatnam

0

కృష్ణ జిల్లా, మచిలీపట్నంలో ఓ ప్రముఖ వైద్యురాలు మాచర్ల రాధాని గుర్తుతెలియని దండగలు హత్య చేశారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలు జవారుపేట లోని తల్లి పిల్లల ఆసుపత్రి లో పిల్లల వైద్యురాలు మాచర్ల రాధా. భర్త మాచర్ల లోకనాథ్, భార్యాభర్తలు ఇరువురు జవార్ పేటలోని తల్లి పిల్లల ఆసుపత్రి నడుపుతున్నారు.  మంగళవారం సాయంత్రం క్రింది ఫ్లోర్ లోని  క్లినిక్ కి వెళ్లిన భర్త లోకనాథ్.  రాత్రి 11 గంటల సమయంలో ఎన్నిసార్లు ఫోన్ చేసినా  డాక్టర్ రాధా స్పందించలేదు.

Also Read: చిరంజీవికి భారీ ఊరట

 అనుమానం వచ్చి భర్త లోక్ నాథ్ పైకి వెళ్లి చూడగా ఆమె రక్తపు మడుగులో పడివుంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకుని బందర్ డిఎస్పి మాధవరెడ్డి, ఇనగుదురుపేట సిఐ ఉమామహేశ్వర రావు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. దుండగులు డాక్టర్ రాధను హత్య చేసి నగలను వలుచుకు వెళ్లారు. భర్త నుండి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie