వాగులో పడి రైతు గల్లంతయిన ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో చోటుచేసుకుంది. వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో నవాబుపేట గ్రామానికి చెందిన రైతు ఎడ్డెల్లి రాజయ్య (50) సంవత్సరాలు ప్రమాదవశాత్తు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఎల్లమ్మ వాగులో పడి కొట్టుకుపోయాడు. సమాచారం తెలుసుకున్న వెంటనే హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
పోలీసులు రెస్క్యూ టీం ను రంగంలోకి దింపారు. వీరితోపాటు గ్రామస్తులు పోలీసులు రెవెన్యూ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. గత వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగడంతో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలోనే రాజయ్య వాగులో పడి కొట్టుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. రాజయ్య కుటుంబ సభ్యుల అరణ్య రోదనలు వర్ణనాతీతం. గల్లంతైన వ్యక్తి క్షేమంగా తిరిగి రావాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.