Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

గులాబీలో అంతా “తారక” మంత్రమే

0

హైదరాబాద్, జూలై 17: అమెరికాలో ఉద్యోగ వదిలేసి కేసీఆర్ కుమారుడిగా తెలంగాణ ఉద్యమంలోకి ఎంట్రీ ఇచ్చారు కేటీఆర్. టీఆర్ఎస్ లో యాక్టివ్ గా పని చేస్తూ వచ్చిన ఆయన 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా సిరిసిల్ల సీటు నుంచి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కల్వకుంట్ల తారకరామరావు సింపుల్ గా కేటీఆర్ గా అందరికీ సుపరిచతమే..! 2009 ముందు వరకు కూడా పెద్దగా ఆయన ఎవరో తెలియదు. కేసీఆర్ కుమారుడిగా రాజకీయ రంగం ప్రవేశం చేసినప్పటికీ… గులాబీ పార్టీ వరకు ఓ గుర్తింపు మాత్రమే ఉండేది! అనూహ్యంగా ప్రత్యక్షంగా రాజకీయాల్లో వచ్చేసిన కేటీఆర్ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేశారు. స్వల్ప మెజార్టీ తొ బయటపడ్డారు! కానీ మలిదశ ఉద్యమం తర్వాత…. సీన్ కంప్లీట్ గా మారిపోయింది. కేటీఆర్ దూకుడు పెంచారు. తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. అంచెలంచలుగా ఎదుగుతూ వచ్చిన ఆయన… పార్టీపై తనదైన ముద్రవేశారు. ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్న రథసారథిగా మారిపోయారు. ఇక పార్టీలో చూస్తే ప్రతి నేత కూడా… ‘తారకమంత్రం’ జపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్ ఈ ఏడాది జరగబోయే ఎన్నికలకు కూడా సిద్ధం కాబోతున్నారు.కేసీఆర్ దంపతులకు 1976, జూలై 24న జన్మించారు కేటీఆర్. ఆయన విద్యాభ్యాసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు పూణె, అమెరికాలో కొనసాగింది. తండ్రి క్రియాశీలక రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నప్పటికీ కేటీఆర్ మాత్రం ఉన్నత చదువులపైనే దృష్టిపెట్టారు. గుంటూరులో ఇంటర్ పూర్తి చేసిన తారకరామరావు హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత పూణెలో ఎమ్మెస్సీ చేయటంతో పాటు న్యూయార్క్ లో ఎంబీఏ చదివారు. కొంతకాలం పాటు ఉద్యోగం చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఏకైక లక్ష్యంతో 2001లో టీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారు కేసీఆర్. 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొన్న కేసీఆర్ తెలంగాణ ఇవ్వటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ సర్కార్ నుంచి బయటికి వచ్చారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి కరీంనగర్ సీటు నుంచి మరోసారి బరిలో నిలబడ్డారు. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ఉపఎన్నిక టీఆర్ఎస్ పార్టీకే అతి పెద్ద సవాల్ మారింది. ఈ టైమ్ లోనే అమెరికా నుంచి తిరిగి వచ్చేసిన కేటీఆర్ తండ్రి కేసీఆర్ కు మద్దతుగా క్యాంపెయినింగ్ చేశారు. ఫలితంగా పరోక్షంగా రాజకీయాల్లోకి ఎంట్రీ చేశారు. సొంత పార్టీలోని నేతలతో కూడా పరిచయాలు పెరిగాయి.

KTR political journey

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అవశ్యకత, తండ్రి కేసీఆర్ చేస్తున్న ఉద్యమానికి ఆకర్షితుడైన కేటీఆర్ అధికారికంగా పార్టీలోకి వచ్చేశారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనటం షురూ చేశారు. ఆ తర్వాత వచ్చిన 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కేటీఆర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తొలిసారిగా 2009లో పోటీ చేశారు కేటీఆర్. సమీప ప్రత్యర్థి కేకే మహేందర్ రెడ్డి చేతిలో కేవలం 171 ఓట్ల తేడాతోనే గెలిచారు. అలా అసెంబ్లీ వరకు వచ్చారు కేటీఆర్. ఈ పరిణామం ఆయన రాజకీయ జీవితంలో కీలక పరిణామం అనే చెప్పొచ్చు. కేసీఆర్ కుమారుడిగా వచ్చిన ఆయన ఓడిపోతే ప్రజల్లోకి మరోలా సందేశం వెళ్లటంతో పాటు, కేసీఆర్ కు కూడా రాజకీయంగా చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండేందని చెప్పొచ్చు. కట్ చేస్తే 14 ఎఫ్ అంశం తెరపైకి రావటం, కేసీఆర్ అమరణ దీక్ష ప్రకటించటంతో మలిదశ ఉద్యమానికి బీజం పడింది. తెలంగాణ అంతా అట్టుడుకుపోయింది. తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ తయారయ్యైంది.

KTR political journey

ఇక కేటీఆర్ పార్టీలో దూకుడు పెంచారు. రాజకీయ ప్రత్యర్థులపై తనదైన శైలిలో మాటలు తుటాలను సంధిస్తూ వచ్చారు. అసెంబ్లీ వేదికగా కూడా అద్భుతమైన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. అనేక బహిరంగసభల వేదికలతో పాటు జేఏసీలు ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొన్నారు. మిలియన్ మార్చ్ తో పాటు రైల్ రోకో, వంటవార్పు వంటి ఉద్యమ కార్యక్రమాల్లో కేటీఆర్ ముందున్నారు. తద్వారా ప్రజలతో పాటు పార్టీలోని నేతలకు కూడా దగ్గరయ్యారు. కేవలం కేటీఆర్ కుమారుడిగానే కాకుండా సొంతంగా ఇమేజ్ ను క్రియేట్ చేసుకునే వరకు వచ్చారు.ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో చూస్తే దాదాపు నేతలంతా తారకమంత్రాన్నే జపిస్తున్నారు. 2018 ఎన్నికల్లో అద్భుత విజయం తర్వాత పార్టీ పరంగా కేటీఆర్ కు ప్రమోషన్ ఇచ్చారు కేసీఆర్. వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా బాద్యతలు అప్పగించారు. ఫలితంగా పార్టీ మొత్తం ఆయన చేతుల్లోకి వచ్చేసినట్లు అయింది. పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న సభలకు కూడా ముఖ్య అతిథిగా హాజరవుతూనే నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

KTR political journey

మరికొద్దిరోజుల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లాల పర్యటన చేస్తున్న కేటీఆర్ ఓ దశలో ఎమ్మెల్యేల అభ్యర్థులను ఖరారు చేస్తున్న పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్న చర్చ గట్టిగా నడుస్తోంది.వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు కేటీఆర్. 90 సీట్లు మావే అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారు. ఇక సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధిపై కేటీఆర్ తన ముద్రను వేశారనే చెప్పొచ్చు. సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు తగ్గేలా చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వపరంగా కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్న పేరు కేటీఆర్ కు ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదగటంతో పాటు కేసీఆర్ కుమారుడిగా గుర్తింపు పొందటం, మరోసారి బీఆర్ఎస్ గెలిస్తే ఆయనే సీఎం అవుతారన్న చర్చ ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశాలు అని చెప్పొచ్చు. తన మాస్ క్లాస్ తో ఆకట్టుకోవటం కేటీఆర్ లో కనిపించే ప్రత్యేకత . ట్విట్టర్ లో తెగ యాక్టివ్ గా ఉండే కేటీఆర్ చాలా మందిగా అండగా, భరోసా గా నిలిచారు. ఎంతో మంది ప్రాణాలను కూడా కాపాడారు. ఇక కేటీఆర్ ను పలు విషయాల్లో పదే పదే ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తుంటాయి. కుటుంబ పాలనలో భాగంగానే కేటీఆర్ ఎంట్రీ అని అంటుంటారు.

Source: Newspulse

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie