- పత్తాలేని రుణమాఫీ, నిరుద్యోగ భృతి
- ప్రభుత్వంపై ఓత్తిడికే దరఖాస్తుల సేకరణ
- కాంగ్రెస్ సీనియర్ నేత గజ్జల స్వామ
జగిత్యాల:2018 అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఏండ్లు గడుస్తున్నా నేటికి అమలుకు నోచుకోలేదని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు, యువతకు మేలు చేయాలనే లక్ష్యంతో ప్రజాహిత దరఖాస్తుల సేకరణ ఉద్యమం చేపడుతున్నామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు గజ్జల స్వామి చెప్పారు. గురువారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గజ్జల స్వామి మాట్లాడారు. ఎన్నికల మ్యానిఫెస్టో అంటే ప్రజలు భగవద్గితల భవిస్తారన్నారు. ఇలాంటి మ్యానిఫెస్టోలో గత ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల హామీలు ఏండ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదన్నారు. ఎన్నికలు రాబోతున్నాయని ప్రభుత్వం హామీలు అమలు చేసేలా కనిపించడం లేదని స్వామి అన్నారు. అందుకే ఎన్నికల ప్రధాన హామీలైన రైతులకు లక్ష్య రూపాయల రుణమాఫీ, విద్యావంతులైన యువతకు నెలకు మూడువేల పదహారు రూపాయలను నిరుద్యోగ భృతిగా ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు.
రైతుల రుణమాఫీ, నిరుద్యోగ భృతిపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి రైతాంగాన్ని, నిరుద్యోగ యువతను జాగృత పరచడానికి ప్రజాహిత కార్యక్రమాన్ని చేపడుతున్నామని గజ్జల స్వామి అన్నారు. ఇందులో భాగంగా ధర్మపురి నియోజకవర్గంలోని రైతులు, యువతను చైతన్యపరిచే కార్యక్రమాన్ని చేపడుతున్నామని వివిధ ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని స్వామి కోరారు. ఈ ప్రజాహిత కార్యక్రమం ద్వారా రైతులు, నిరుద్యోగ యువత నుంచి పెద్దఎత్తున దరఖాస్తులను సేకరించి మండల అధికారులకు, జిల్లా కలెక్టర్ కు, ముఖ్యమంత్రికి, రాష్ట్ర గవర్నర్ కు అందజేస్తామని గజ్జల స్వామి చెప్పారు. రాష్ట్రంలో నేడు ఎమర్జెన్సీని పోలిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
ఒక ప్రాజెక్టును చేపడితే దానిద్వారా వచ్చే లాభాన్ని ప్రజలకు వివరించాలని, అవగాహన కల్పించాలని ప్రభుత్వం అలాకాకుండా నిర్బందాలను కొనసాగిస్తోందన్నారు. అందులో భాగమే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ల గృహా నిర్బందమని దీన్ని తీవ్రంగా ఖండిస్తూన్నామన్నారు. అలాగే ప్రశ్నించే వారిని పట్టుకెళ్లి జైల్లో పెట్టె సంస్కృతి నేడు రాష్ట్రంలో కనిపిస్తోందని మందకృష్ణ మాదిగ, తీన్మార్ మల్లన్న సంఘటనలు ఉదహరణలన్నారు.
ప్రజాహిత దరఖాస్తుల సేకరణ ఉద్యమంతో రైతులకు, యువతకు మేలుజరుగుతుందని ధర్మపురి నియోజకవర్గంలో చేపట్టే ఈ దరఖాస్తుల సేకరణలో రైతులు, యువత పెద్దఎత్తున పాల్గొని తమ దరఖాస్తులను సమర్పించాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు గజ్జల స్వామి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐఎన్టీయుసి ఉమ్మడి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుమ్మడి కుమారస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మీపతి గౌడ్, కాంగ్రెస్ సేవాదల్ జిల్లా అద్యక్షులు బొల్లి స్వామి, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్, ముదిరాజ్ మహాసభ యువజన అద్యక్షులు కొమురయ్యలు ఉన్నారు.