నల్గొండ: కూలీ ల ఆటో అదుపుతప్పి బోల్తా పడి ఎనిమిది మంది గాయపడ్డారు. నిడమనూరు మండలం వెంకట్ నగర్ వద్ద మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామానికి చెందిన 9 మంది మహిళా కూలీలు హాలియా వైపు ఆటోలో వెళ్తుండగా ఆటో అదుపు తప్పి ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి పల్టీ కొట్టింది. అక్కడ పెద్ద పెద్ద రాళ్లు ఉండడంతో అందరూ గాయాలపాలయ్యారు. నలుగురి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు అంబులెన్స్ లో మిర్యాలగూడ లో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మిగతా వారిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరు అందరూ పుచ్చకాయలు కోయడం కోసం కూలీ కి వెళ్తూ గాయపడ్డారు. సమాచారం అందుకున్న క్షతగాత్రుల కుటుంబ సభ్యులు ఆస్పత్రి చేరుకున్నారు.