Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మద్యం మత్తులో డ్రైవర్… ముగ్గురికి గాయాలు

0

డ్రైవర్ ఆజాగ్రత్తతో ఆర్టీసీ బస్సు రోడ్డుపై నిలుచున్న ముగ్గురు వ్యక్తులను ఢీ కొట్టింది. ఘటన కొత్తకోట మండలలోని కానాయపల్లి గ్రామ స్టేజి దగ్గర చోటు చేసుకుంది. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆత్మకూరు నుండి వనపర్తి వెళుతున్న ఆర్టీసీ బస్సు బుగ్గపల్లి తండాకు చెందిన సేవ్య నాయక్, మల్లేష్ , అనిల్ లను ఢికొట్టింది.

వారంతా రోడ్డు పక్కన మాట్లాడుకుంటుండగా ప్రమాదం జరిగింది. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో సేవ్యా నాయక్ కుమారుడైన మల్లేష్ నాయక్కు కాలు విరిగిపోయింది. ప్రమాదం జరగగానే బస్సు డ్రైవర్ పారిపోయినట్లు సమాచారం. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ తాగిన మత్తులో వున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie