హైదరాబాద్, ఫిబ్రవరి 6,
సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురు యువకులను కూకట్ పల్లి ఎస్ఓటీ పోలీసులు అరెస్టే చేశారు. 24 ఏళ్ల పవన్ కుమార్ అనే ఓ వ్యక్తి.. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. మరోవైపు అధిక మొత్తంలో డబ్బులు సంపాదించేందుకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నైజీరియన్ దగ్గర నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలోనే కూకట్ పల్లిలోని రంగదాముని చెరువు సమీపంలో పవన్ కుమార్ వేరే వాళ్లకు డ్రగ్స్ అమ్ముతుండగా.. ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. అతడితో పాటు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న హరి కృష్ణ(21), కిరణ్ తేజ(20), సాయి కుమార్(24), రఘు(23) అనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మరో నిందితుడు నదిలా అలీ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి 18 గ్రాములు ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటు నాలుగు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
వాటి విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని డీసీపీ వెల్లడించారు. వారంతా యువకులేనని, ఉన్నత చదువు పూర్తయ్యాక జాబ్ సెర్చింగ్ కోసం చూస్తున్న సమయంలో ఈజీ మనీ కోసం ఇలాంటి పని చేశారని పోలీసులు వెల్లడించారు.”సైబరాబాద్ సీపీ ఆదేశాల మేరకు సైబారాబాద్ కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ పోలీస్ విభాగం అలాగే ఎస్ఓటీ విభాగం ముఖ్యంగా డ్రగ్స్ పెడ్లర్స్ మీద గానీ వినియోగదారుల మీద గానీ గట్టి నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా బాలానగర్ పరిధిలోని కూకట్ పల్లి డివిజన్ లో నిన్న ఎస్ఓటీ వాళ్లకు, కూకట్ పల్లి పోలీసులకు సమాచారం రావడం.. ఆ పక్కా సమాచారంతో కూకట్ పల్లిలోని ఐడియల్ పాండ్ దగ్గర మనం ఒక ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాం. గచ్చిబౌలిలోని నివాసం ఉండే విజయవాడకు చెందిన హరికృష్ణ, బెంగళూరులో ఉండే అనంతపురంకు చెందిన సాయి కుమార్, కిరణ్ తేజ్, పవన్, రఘునందన్ సాంబమర్తి..
ఈ ముగ్గురు కూడా గుంటూరు తాడేపల్లి ఏరియాకు సంబంధించిన వాళ్లు. ఈ ఐదుగురిని అనుమానాస్పద స్థితిలో మనం అదుపులోకి తీసుకొని సెర్చ్ చేయడంతో వీరి దగ్గర నుంచి 18 గ్రామ్స్ ఎండీఎంఏ మెటీరియల్ ను సీజ్ చేయడం జరిగింది.” – బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సుమారు 18 లక్షల విలువైన డ్రగ్స్ ,178 గ్రాముల కొకైన్ హాయత్ నగర్ ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియాకు చెందిన గాడ్విన్ ఇంపీయాగ్ ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లై చేస్తుండగా ఎక్సైజ్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బెంగుళూరు నుంచి డ్రగ్స్ ను హైదరాబాద్ కు తీసుకువస్తున్నట్లు హయత్ నగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ గౌడ్ తెలిపారు. గతంలో దుల్ పేట్ డ్రగ్స్ కేసులో గాడ్విన్ అరెస్ట్ అయ్యాడని అన్నారు. నిందితుడు నకిలీ పాస్ పోర్ట్ తో ట్రావెల్ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు.
3 నెలలో 400 సిమ్ కార్డులు ఉపయోగించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. 2015 లో చదువు నిమిత్తం హైదరాబాద్ వచ్చిన గాడ్విన్ ఇంపీయాగ్ ఆంధ్రప్రదేశ్ లో కొంత కాలం ఉన్నాడని అన్నారు. వీసా గడువు ముగిసినా ఇల్లీగల్ గా దేశంలో ఉంటున్నాడని తెలిపారు. నిందితుడు రెండు పాస్ పోర్ట్ లు కలిగి ఉన్నాడన్నారు. బెంగళూరుకు చెందిన అస్లాం నుంచి డ్రగ్స్ తెచ్చాడన్నారు. బోర్నవిటా డబ్బాలో డ్రగ్స్ ను హైదరాబాద్ తీసుకొచ్చాడని చెప్పారు.”బెంగళూరు నుంచి బస్ లో హైదరాబాద్ కు డగ్స్ తీసుకొచ్చాడు. బెంగళూరు నుంచి 200 గ్రాములు తెచ్చాడని చెప్పుతున్నాడు. అందులో 178 గ్రాముల డ్రగ్స్ మాత్రమే దొరికింది. 22 గ్రాములు అమ్మేసినట్లు చెపుతున్నాడు. దూల్ పేట్ కేసులో అరెస్ట్ అయ్యాడు. మూడు నెలల పాటు జైల్లో ఉన్నాడు. బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ ఈ దందా చేస్తున్నాడు.