ఐతవరం వరదను పరిశీలించిన డీపీసీ, ఎమ్మెల్సీ
DCP Vishal Gunni and MLC Arun Kumar inspected the flood on National Highway 65 at Aitavaram
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద 65వ జాతీయ రహదారిపై వస్తున్న వరదను డిసిపి విశాల్ గున్ని, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. డీసీపీ విశాల్ గున్ని మాట్లాడుతూ 65వ జాతీయ రహదారిపై తెలంగాణ రాష్ట్రం నుండి భారీగా వరద వస్తుంది. మా పోలీసు డిపార్ట్ మెంట్ మొత్తం వాహనాలు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. రాత్రి సమయం దాటినా తర్వాత వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని అన్నారు.
ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గంలో ఎక్కడ కుడా ప్రజలు ఇబ్బంది పడకుండా అధికార యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ చేసాం. వరద పూర్తిగా తగ్గిపోయే వరకు వాహనదారులు ఎవరు కూడా జాతీయ రహదారిపై వాహనాలు రావద్దు.నందిగామ నియోజకవర్గంలో ఎక్కడ అయితే వరదలో చిక్కుకున్నారో వారిని కాపాడే పరిస్థితి రెస్క్యూ టీం, పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.