- అందం వెనుక దాగివున్న ముప్పు
- పరిహాసంగా మారిన హరితహారం
- వరంగల్
పచ్చని చెట్లతో గాలిలో ఆక్సిజన్ శాతం పెరిగి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాకరంగా హరితహారం కార్యక్రమం చెపట్టింది. చెట్లు, మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణం, ప్రజారోగ్యం కార్యక్రమం లక్ష్యం. అయితే, వరంగల్ నగరంలో ప్రమాదకరమైన మొక్కల్లో కోనో కార్పస్ అనే మొక్కలను రోడ్ల పక్కన, డివైడర్లపైనా, గ్రామాల్లో విరివిగా ఈ మొక్కలను నాటుతున్నారు. పచ్చదనం, అందం కోసం ఈ మొక్కలను విరివిగా పెంచేస్తున్నారు. అందం సంగతి అటుంచితే వీటివల్ల జరిగే నష్టమే ఎక్కువుగా ఉంటుంది. రోడ్లు అందంగా కనిపిస్తాయనే ఉద్దేశంతో డివైడర్లు, ఫుట్ పాత్ ల పక్కన ఈ చెట్లను నాటారు.
విస్తరిస్తున్నా పట్టింపు లేదు..!
నగరాల్లో, పట్టణాల్లో ఎక్కువగా విస్తరిస్తున్న గానీ అధికారులు పట్టించుకోకుండా ప్రజల ఆరోగ్యం పై మౌనంగుండటం గమనార్హం. ఈ కోనో కార్పస్ మొక్కల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఈ చెట్లు పూల నుంచి అధికంగా పుప్పొడి వస్తుంది. ఇది గాలిలో కలవడం, మనుషులు పీల్చుకుంటే శ్వాసకోశ సమస్యలు రాడవం జరుగుతుంది. అని పెద్దలు చెబుతున్న మాట. ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్య అధికంగా ఉంటోంది. తొలుత ఈ మొక్కలను విరివిగా నాటినా ఆ తర్వాత వీటి వల్ల జరుగుతున్న నష్టాలను గ్రహించి నాటడాన్ని నిలిపేశారు. కానీ హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ నుండి ములుగు రోడ్ వెళ్ళే దారిలో ఉన్న రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ లో కోనో కార్పస్ చెట్లు విస్తరిస్తూ, కరెంట్ వైర్లు ను తాకుతూ స్తంభాల కంటే ఎత్తులో ఏపుగా పెరిగినా జీడబ్ల్యూఎంసీ అధికారులు ఏమాత్రం పట్టిపు లేకుండా ఉండటం గమనార్హం. గ్రేటర్ వరంగల్ లోనే కాకుండా గ్రామాల్లో కూడా ఎక్కువగా ఇవే చెట్లు ఉన్నాయి.
పెద్దపెల్లి జిల్లా మంథని పురపాలక సంఘం పరిధిలో పట్టణంలోని డివైడర్ ల పైన, మంథని – పెద్దపల్లి ప్రధాన రహదారి పైన కోనో కార్పస్ మొక్కలు విరివిగా ఉన్నాయి. దీంతో ఈ చెట్ల వల్ల గ్రామాల్లోని ప్రజలు ముఖ్యంగా ముసలివాళ్లు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.పర్యావరణానికి ముప్పుగా మారిన కోనో కార్పస్ చెట్లు ఈ మొక్కల కారణంగా పర్యావర సమతుల్యత దెబ్బతింటుందని, ఈ మొక్కలు అటవీ ప్రాంతాల్లో పెరగడం వల్ల గడ్డిజాతి, ఇతర కలుపు మొక్కలు పెరగడం కష్టమవుతుందని తద్వార వన్య పాణాలకు ఆహారం దొరకదంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ ఈ మొక్కల పెంపకాన్ని బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. కానీ గ్రేటర్ వరంగల్ అధికారులు మాత్రం ఈ విషయాన్ని మరిచినట్లు అర్థమవుతోంది. అటు హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ, ఇటు హనుమకొండ బస్టాండ్ నుండి బాలసముద్రం వెళ్ళే దారిలో కూడా విపరీతమైన ఎత్తులో ఈ చెట్లు పెరిగినా కూడా అధికారులు మౌనంగా ఉన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలకు, కార్లు, బస్ ఇలాంటి మోటర్ వాహనాలకు ఆ చెట్ల తో వచ్చిన నీడతో స్తంభాలకు ఉన్న లైట్ ఫోకస్ ను కమ్మెస్తున్నయి. దీంతో వాహన దారులకు ఇబ్బంది పడుతున్నారు.
గ్రేటర్ వరంగల్ అధికారులు ఎక్కడ..?
కోనో కార్పస్ చెట్ల వల్ల చాలా నష్టాలున్నాయని, వాటిని వెంటనే తొలగించాలని స్థానికులు ఎంత మొత్తుకున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. వాటి నుంచి వచ్చే వాసనను పీల్చుకోవడం వల్లే చాలా నష్టాలు ఉన్నాయని తెలియడంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ చెట్ల వేర్ల వల్ల మంచి నీల్ల పైపులు ధ్వంసం అవుతున్నాయని ఆరోపించారు. వెంటనే ఈ మొక్కలను తొలగించాలని హనుమకొండ వాసులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, కమిషనర్ వెంటను స్పందించి మొక్కలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.