గన్నవరం: భారత రైతాంగం అనేక సమస్యల్ని ఎదుర్కొంటోంది. నిరుద్యోగం పెరిగిపోతోందని బీఆర్ఎస్ ఏపీ ఛీఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. కులాలు, మతాల పేరుతో దేశ విభజన జరుగుతోంది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళవుతున్నా తాగునీరు, సాగునీటి సమస్యలు పరిష్కారం కాలేదు. ఉపాధి గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ంఉది. ఇప్పటికీ గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేదు. ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నామని అన్నారు. కులాల పేరుతో, మతాల పేరుతో దృష్టిని మరల్చి పాలిస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థపై కేంద్రానికి పట్టు లేదు. దేశానికి ప్రత్యామ్నాయ పార్టీ అవసరం వుంది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా బలమైన పార్టీ అవసరం. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఎన్నో సమస్యలు వచ్చాయి. ఏపీకి రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదు. దుంగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ విషయంలో నిర్లక్ష్యం వుంది. విజయవాడ, వైజాగ్ మెట్రో రైలు సౌకర్యం లేదు . కేంద్రాన్ని అడిగేవాళ్లు లేరు.. నిలదీసేవాళ్లు లేరని అన్నారు.
సవతితల్లి ప్రేమను కేంద్రం రాష్ట్రంపై చూపుతోంది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా భారత రాష్ట్ర సమితి వుంది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోంది. తెలంగాణ మోడల్ దేశానికి దిక్సూచి. తెలంగాణ తరహా అభివృద్ధి అన్ని రాష్ట్రాల్లో జరగాలి. బీఆర్ఎస్ దేశంలో బీజేపీకి ఒక ప్రత్యామ్నాయ పార్టీగా విస్తరించనుంది. కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాలకే, కొన్ని ప్రాంతాలకే పరిమితం. మిగతా రాష్ట్రాల్లో ఉన్న జాతీయ పార్టీలు కూడా ఆయా ప్రాంతాలకే పరిమితం. ఏపీలోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ విస్తరిస్తోంది. స్వశక్తితో బీఆర్ఎస్ దేశంలోనే, బలమైన పార్టీగా రాబోయే ఎన్నికల్లో చూస్తారని అయన అన్నారు.