విచారణపై కలెక్టర్ అసహనం….
జగిత్యాల: మహిళ కడుపులో ఆపరేషన్ చేసి గుడ్డ మరిచిపోయిన సంఘటనలో ఇంకా మిస్టరి వీడలేదు అధికారుల విచారణ తీరుపై జిల్లా కలెక్టర్ అసహన వ్యక్తం చేసినట్టు తెలిసింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల్ మండలం నమ్మిలికొండ గ్రామానికి చెందిన నవ్య శ్రీ కడుపులో ఆపరేషన్ చేసి కాటన్ గుడ్డ మరిచిన సంఘటనపై జగిత్యాల వైద్యాధికారుల బృందం కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా విచారణ బృందమైన జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ రాములు, గైనకాలజీ హెచ్ ఓ డి అరుణ లు జగిత్యాల మాతా శిశు కేంద్రంతోపాటు వేములవాడలోని నందిని ప్రైవేట్ ఆసుపత్రిలో విచారణ చేపట్టారు.
నవ్య శ్రీ 16 మాసాల క్రితం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవం కోసం రాగా వైద్యులు ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. కొద్దిరోజులుగా ఆమెకు కడుపునొప్పి రావడంతో స్కానింగ్ చేసిన వైద్యులు కడుపులో కాటన్ గుడ్డ ఉన్నట్టు గుర్తించి వేములవాడ ప్రైవేట్ ఆసుపత్రిలోశస్త్ర చికిత్స చేసి తీసివేశారు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయగా జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష విచారణ జరపాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించింది. ఈ మేరకు వైద్యాధికారుల బృందం వేములవాడాలని నందిని ప్రవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేసి మహిళ కడుపులోంచి కాటన్ గుడ్డ తీసిన వైద్యురాలను విచారించారు. అనంతరం జగిత్యాల పట్టణంలోని మాతా శిశు కేంద్రంలో విచారణ చేశారు. అయితే అప్పుడు డాక్టర్ మీనా అనే వైద్యురాలు శిరీష రెడ్డి పర్యవేక్షణలో ఆపరేషన్ చేసినట్లు రికార్డ్ లో ఉన్నట్లు విచారాణ బృందం తెలిపింది. విచారణ రిపోర్టును కలెక్టర్కు అందజేస్తామని విచారణ అధికారుల బృందం పేర్కొంది.
విచారణపై జిల్లా కలెక్టర్ అసంతృప్తి
వైద్యాధికారుల బృందం చేపట్టిన విచారణ పై జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే వైద్య అధికారులు తమ ఆసుపత్రిలో 6*6 గుడ్డలను వాడతామని మహిళ కడుపులో 10*10 సైజులో ఉన్న కాటన్ గుడ్డ లభించినట్లు వైద్యులు తెలిపారు. అయితే మహిళ కడుపులో నుంచి వెలికి తీసిన కాటన్ క్లాత్ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి కాదని ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఈ విషయం పట్ల జిల్లా కలెక్టర్ ఆసంతృప్తి చెందినట్లుగా తెలుస్తోంది . ఆసలు మహిళ కడుపులోకి కాటన్ క్లాత్ ఏ ఆసుపత్రిలో వదిలి పెట్టారు అనే అంశం తేల్చక పోవడం ఫై మిస్టరి వీడలేదు. దీంతో వారం రోజుల్లో పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరినట్లు సమాచారం.