విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయ బస్సు టికెట్‌పై వివాదం మొదలైంది. ఏకంగా ఆలయం పేరు మార్చేశారంటూ టీడీపీ జగన్ సర్కార్‌ను టార్గెట్ చేసింది. ‘చివరకు రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాల పేర్లు కూడా మార్చేస్తున్నారు. బెజవాడలో ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న కనకదుర్గమ్మ పేరున ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పేరుని శ్రీ సూర్య మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంగా మార్చి, టికెట్ లు ఇస్తున్నారు. నీ సైకో బుద్ధులకు అంతే లేదా, జగన్ రెడ్డి ?’ అంటూ ఘాటుగా స్పందించింది.
విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లే భక్తుల కోసం దేవస్థానం బస్సులు నడుస్తున్నాయి. ఆలయానికి సంబంధించి మొత్తం తొమ్మిది బస్సులు ఉన్నాయి.. అందులో నాలుగు బస్సులను ప్రతి రోజూ విజయవాడ రైల్వేస్టేషన్, బస్టౌండ్ నుంచి ఇంద్రకీలాద్రిపై దుర్గగుడికి నడుస్తున్నాయి. మరో మూడు బస్సులను కొండ దిగువన ఉన్న దుర్గాఘాట్ నుంచి నడుస్తున్నాయి. రెండు బస్సులు స్టాండ్ బైగా ఉంచింది దేవస్థానం. ఈ బస్సుకు టికెట్ ధర రూ.10 నిర్ణయించారు. ఈ టికెట్ విషయంలోనే వివాదం మొదలైంది.
టికెట్‌పై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం బదులుగా శ్రీ సూర్య మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పేరుతో ప్రింట్ చేశారు. మిగిలిన వివరాలను కూడా ప్రస్తావించారు. అయితే దుర్గా మల్లేశ్వర స్వామి పేరు బదులు శ్రీ సూర్య మల్లేశ్వర స్వామి పేరును ప్రింట్ చేయడంపై విమర్శలొస్తున్నాయి. ఈ విషయాన్ని టీడీపీతో పాటూ మరికొందరు ట్వీట్ చేశారుఆలయం పేరును మార్చేశారని.. ఈ తప్పు పొరపాటున జరిగిందా లేక ఇంకేదైనా కారణం ఉందా అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ పొరపాటున జరిగితే వెంటనే ఈ ప్రింటింగ్ రోల్‌ను వెంటనే తొలగించాలని కోరుతున్నారు.
ఇవాళ్టి నుంచే మహానాడు.. భారీ ఏర్పాట్లు చేసిన టీడీపీ.
ఈ టికెట్‌పై ఆలయం పేరు మార్చడంపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ టికెట్ వైరల్ అవుతోంది.ఈ బస్సులు ప్రతి రోజూ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రైల్వేస్టేషన్, బస్టాండ్–దుర్గగుడి మధ్య బస్సులు సర్వీసులు నడిపిస్తున్నారు. పండుగల సమయంలో, రద్దీ ఉన్నప్పుడు ట్రిప్పుల సంఖ్యను పెంచుతారు. ఈ బస్సుల్లో విజయవాడ బస్టాండ్, రైల్వేస్టేషన్, దుర్గాఘాట్ నుంచి రూ.10 టికెట్ వసూలు చేస్తారు. అయితే గతంలో ఈ రూ.10ని కూడా రద్దు చేయాలని ప్రతిపాదనలు తెచ్చారు. మరి ఈ టికెట్ వ్యవహారంపై దేవస్థానం స్పందించాల్సి ఉంది.