Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

సహాయక చర్యల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొనాలి..

Congress party ranks should participate in relief activities

0
  • భారీ వర్షాలు కురుస్తున్నాయి..
  • ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: ములుగు ఎమ్మెల్యే సీతక్క..

వరదల సహాయక చర్యల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొనాలని, భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ములుగు మండలంలోని సర్వాపూర్, జగ్గన్న గూడెం మధ్యలో ఉన్న బొగ్గుల వాగు ఉధృతిని, ములుగు, దేవగిరిపట్నం రోడ్డును మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలో భారీ వర్షాలు ఉన్నందున గ్రామాలలో పాత ఇండ్లు, గుడిసెలలో, నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది తీరా గ్రామాలలో పెద్దలు తమ పిల్లలను నదులలోకి, వాగుల వద్దకి వెళ్లకుండా చూడాలని అన్నారు. వాగులు వంకలలో కూడా నీటి ప్రవాహాలు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నందున ఆయా ప్రాంతాలలో అప్రమతంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలో ఉన్న వివిధ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది ప్రజలను అప్ర‌మ‌త్తం చేసి, పగడ్భందీ చర్యలు తీసుకోవాలని కోరారు.

గ్రామాలు జలమయమయ్యే ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో వుంటూ, ఎటువంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే పర్యవేక్షించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు ప్రమాదంలో పడే ఆవకాశం ఉంటుందని, కాబట్టి రోడ్డు రవాణా, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా విద్యుత్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ శాఖ అధికారుల సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, ములుగు పట్టణ అధ్యక్షులు చింత నిప్పుల భిక్షపతి, బీసీ సెల్ మండల అధ్యక్షులు పౌడాల ఓం ప్రకాష్, మాజీ సహకార సంఘం చైర్మన్ కునూరి అశోక్ గౌడ్, స్థానిక సర్పంచ్ దగట్ల జయమ్మ రఘు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి నునేటి శ్యామ్, నాయకులు పల్లె జయపాల్ రెడ్డి, ముసినిపెల్లి కుమార్ గౌడ్, గందే శ్రీను, బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు గుండ బోయిన రమేష్, రాజు, బాబురావు, నగేష్, నర్సయ్య, సంపత్, అశోక్, అనీల్, సుధాకర్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie