Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఇన్నాళ్ళు ఒక లెక్క ఇప్పటినుండి మరో లేక్క…

Congress party is getting ready to BC Garjana

0

బీసీ గర్జనకు రెడీ అవుతోన్న కాంగ్రెస్ పార్టీ
హైదరాబాద్ జూలై 15: కాంగ్రెస్ పార్టీ బీసీ గర్జనకు రెడీ అవుతోంది. ఆగష్టునెలలో బీసీ గర్జన నిర్వహించాలని దానికి ప్రియాంక గాంధి లేదా రాహుల్ గాంధీని పిలిపించాలని ఆలోచిస్తున్నది. ఇదే విషయమై పార్టీలోని బీసీ నేతలంతా సమావేశమయ్యారు. గర్జనను నిర్వహించాలి కానీ ఎక్కడ నిర్వహించాలనే విషయాన్ని మాత్రం ఇంకా డిసైడ్ చేయలేదు. ఇదే విషయమై సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతు కాంగ్రెస్ ను ఒక్కపటి పార్టీలాగ చూడద్దని విజ్ఞప్తిచేశారు.ఇన్నాళ్ళు ఒక లెక్క ఇప్పటినుండి మరో లేక్క అన్నట్లుగా సినిమా డైలాగు చెప్పారు. ఇన్నాళ్ళూ ఒకలెక్క ఇప్పటినుండి మరో లెక్కంటే కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం ముందు తర్వాత అన్నట్లుగా ఉంది వీహెచ్ డైలాగు.బీసీ గర్జన విషయమై హనుమకొండలోని పార్టీ ఆఫీసులో నేతలు సుదీర్ఘ సమావేశమే నిర్ణయించారు.

కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే బీసీలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను అధిష్టానానికి కూడా చెప్పినట్లు వీహెచ్ అన్నారు.సీనియర్ల లెక్క ఏమిటంటే 119 నియోజకవర్గాల్లో కనీసం 45 సీట్లు బీసీలకు కేటాయించాలట. ఎందుకంటే 70 నియోజకవర్గాల్లో గెలుపోటములను డిసైడ్ చేసే సత్తా బీసీలకు ఉందంటున్నారు. 70 నియోజకవర్గాల్లో గెలుపోటములను డిసైడ్ చేసే సత్తా ఉన్నపుడు అందులో సగం అంటే 45 నియోజకవర్గాలను బీసీలకు కేటాయించమని డిమాండ్ చేయటంలో తప్పులేదంటున్నారు.కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ అనే ముద్రను చెరిపేసి కాంగ్రెస్ అంటే రెడ్లదే కాదని బీసీలది కూడా అని జనాలతో అనిపించుకోవాలన్నదే తమ కోరికని బీసీ నేతలంటున్నారు.

తెలంగాణాలో బీసీల్లో చాలా ఉపకులాలున్నప్పటికీ ప్రధానంగా గౌడ్లు యాదవులదే కీలకపాత్రగా సాగుతోంది. ఏ పార్టీని తీసుకున్నా పై రెండు సామాజికవర్గాలదే ఆధిపత్యంగా ఉంది. అందుకనే మిగిలిన ఉపకులాలకు కూడా ప్రాధాన్యత కల్పించాలని బీసీనేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఖమ్మంలో మొదలుపెడితే అటు ఆదిలాబాద్ జిల్లా వరకు బీసీలు లేని జిల్లాయే లేదంటున్నారు. బీసీ నేతల వరస చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో కొట్లాడైనా తమకు దక్కాల్సిన టికెట్లను దక్కించుకునేట్లే కనిపిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie