Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం ఖాయం

Former Rajya Sabha Member V Hanumantha Rao

0
  • అలిగిన పొన్నం ప్రభాకర్
  • బిసి డిక్లరేషన్ చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్
  • పొన్నం ప్రభాకర్ కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం
  • తెలంగాణ సంపద ఇతర రాష్ట్రాలకు పంచుతున్న కేసీఆర్
  • మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు అన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బిసి ఐక్యవేదిక సమావేశం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ గైర్హాజరు హాజరయ్యారు. తెలంగాణ ఎన్నికల కమిటీలో తనకు స్థానం కల్పించకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన విషయం విధితమే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పొన్నం అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు ఒకింత నిరాశకు లోనయ్యారు. కాగా బీసీ ఐక్యవేదిక సమావేశానికి మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వి. హనుమంతరావు మాట్లాడుతూ చెన్నా రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగిందని తెలిపారు. నా 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో కెసిఆర్ లాంటి ముఖ్యమంత్రిని నేను ఎన్నడు చూడలేదని ఎద్దేవా చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీల గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు. సోనియా గాంధీ కి రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా సున్నితంగా తిరస్కరించారు తప్ప పదవుల గురించి ఆలోచించలేదని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం జరిగిందని వెల్లడించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున కర్గే ని ఏఐసీసీ అధ్యక్షులుగా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇలా బడుగు బలహీన వర్గాల వారిని ఎస్సీ ఎస్టీలను అధ్యక్షులుగా నియమించే దమ్ము ఇతర పార్టీలకు ఉందా అని ప్రశ్నించారు. నేను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడినైతే ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాడిని చేశారు. బీసీ డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ అని దేశంలో ఏ పార్టీ అయినా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల ఓట్ల ద్వారానే గెలుస్తున్నాయని కానీ బీసీలను ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ తెలంగాణ పైసలు బీహార్, పంజాబ్, రాష్ట్రాల్లో పంచుతున్నారని ఇక్కడి రైతులు కేసీఆర్ కండ్లకు కనపడడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నాయకుడైన మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ అవుట్ రాహుల్ గాంధీ ఇన్ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గం లో బీసీలకు మూడు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని అన్నారు.

జీవన్ రెడ్డి మాట్లాడుతూ 60 శాతం ఉన్న బలహీన వర్గాల వారికి సముచిత స్థానం కల్పించాలని ప్రతి పార్లమెంటు నియోజకవర్గం లో రెండు సీట్లు బలహీన వర్గాలకు కేటాయించాలని స్పష్టం చేశారు. దీనిపై పీఏసీ కమిటీలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. బలహీన వర్గాల వారికి సహాయం చేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బిఆర్ఎస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేల బీసీలకు లక్ష రూపాయల రుణం ఇస్తామని బీసీలను మభ్యపెడుతున్న కేసీఆర్ ఆయన క్యాబినెట్లో 18 మంది మంత్రులు ఒక స్పీకర్, శాసనమండలి స్పీకర్ తో కలిపి మొత్తం 20 మంది ఉంటే అందులో ముగ్గురే బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రులు ఉండడం హాస్యాస్పదం అన్నారు. బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం చేస్తున్నది, చేసింది వి హనుమంతరావు అన్నారు.

దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ బలహీన వర్గాల వారికి న్యాయం జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీలోనే అన్నారు. పొన్నం ప్రభాకర్ ఎన్ ఎస్ యు ఐ, మార్క ఫెడ్ చైర్మన్ గా, పార్లమెంటు సభ్యులుగా అవకాశం ఇచ్చిందని, ఆయనకు మళ్లీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు చెందిన వారిని పిసిసి అధ్యక్షులుగా ఎంతో మందికి అవకాశం కల్పించిందని ఇది వేరే పార్టీల వల్ల అవుతుందా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆది శ్రీనివాస్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్కాన్ సింగ్, ఈర్ల కొమురయ్య వైద్యుల అంజన్ కుమార్ నాయకులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సంగీతం శ్రీనివాస్, నాగుల సత్యనారాయణ గౌడ్ ఘంటా రాములు సిరాజు హుస్సేన్ చర్ల పద్మ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie