బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా
న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 14: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్‌లో లేదని.. అధికారంలోకి రాలేమనీ కాంగ్రెస్ నేతలు అంటున్నారన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఆ పార్టీలో గెలిచిన వారు బీఆర్ఎస్ లోకి వెళ్ళారన్నారు.
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే గెలిచిన తర్వాత బీఆర్ఎస్‌కు వెళ్తారని ప్రజలు అనుకుంటున్నారన్నారు.బీజేపీ అధికారంలోకి రాదంటే.. మరి సీఎం కేసీఆర్ బీజేపీ ని ఎందుకు తిడుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు అన్నీ కలిసి పోటీ చేస్తాయని అన్నారు. వాళ్ళందరూ దండుపాళ్యం బ్యాచ్.. అంటూ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌కు వయసు పెరిగింది… అందుకే ఇంకా ఈటల రాజేందర్ వాళ్ళ పార్టీలో ఉన్నారని అనుకుంటున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.