బీజేపీ రాష్ట్ర నాయకురాలు భోగ శ్రావణి
జగిత్యాల:రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు అకాల వర్షాలతో నష్టపోయిన రైతన్నలు ఆవేదనలకు గురవుతున్నారని పంట నష్టపోయిన రైతన్నలకు ప్రభుత్వం సత్వరమే స్పందించి పంట నష్టపరిహారం రైతులకు చెల్లించాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. గురువారం బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జగిత్యాల బీజేపీ పార్టీ పక్షాన స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో తాహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు..
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్. భోగ. శ్రావణి మాట్లాడుతూ అకాల వర్షాలతో పెద్ద ఎత్తున వరి ధాన్యం తడిసిందని, అలాగే మామిడి నేలరాలింది, మామిడి రైతులకు కూడా గిట్టుబాటు ధర రావడం లేదన్నారు, వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారంగా మామిడి పంటకి ఎకరానికి 80,000, వరి పంటకి ఎకరానికి 20,000 నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మదన్ మోహన్, పట్టణ అధ్యక్షులు వీరభత్తిని అనిల్ కుమార్, మండల అధ్యక్షులు నలువల తిరుపతి, ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, కిసాన్ మోర్చా అధ్యక్షులు ముద్రం రాము, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు పత్తి రామేశ్వరి, యువ మోర్చా అధ్యక్షులు హలో రవితేజ, దళిత మోర్చా మండల అధ్యక్షుడు తరాల మహేష్, తాటి పెళ్లి ఎంపీటీసీ పూదారి శ్రీనివాస్, పవన్ సింగ్, సుంకటి దశరథ రెడ్డి, కొక్కు గణేష్, మెరుగు ఉమేష్, పురెళ్ళ ప్రశాంత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు