సమాజ అవసరాలను గుర్తించి తమ వంతు సహాయంగా సేవ చేయడం కోరమండల్ మహిళా క్లబ్ లక్ష్యమని క్లబ్ అధ్యక్షురాలు సిహెచ్ వెంకట దుర్గావతి పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో కూరగాయల మార్కెట్ వద్ద కోరమండల్ మహిళా క్లబ్ నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ గత 41 రోజులుగా తమ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
బాటసారుల వేసవి దప్పికను తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రం ఎంతో ఉపయుక్తమని అన్నారు. రోజురోజుకీ ఎండల తీవ్రత పెరుగుతున్నందున రోడ్ల వెంబడి రాకపోకలు సాగించే బాటసారు లకు మజ్జిగ పంపిణీ చేయాలనే ఉత్తమ ఆశయంతో తమ క్లబ్ సభ్యులు మిట్టమధ్యాహ్నం ఎంతో శ్రమించి మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని వెంకట దుర్గావతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లీశ్వరి, శ్రీదేవి, లక్ష్మీ సృజన ,అంజుమ్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఎక్సైజ్ శాఖ మాత్రమే బాగా పనిచేస్తోంది. యస్, విష్ణు వర్దన్ రెడ్డి.