Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

గద్వాల జిల్లాల్లో కేసీఆర్ పర్యటన.

0

సీఎం కేసీఆర్‌… జోగుళాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్  ఆఫీస్‌ను ప్రారంభించారు సీఎం. పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్  జెండాను ఎగురవేశారు. అనంతరం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి పుష్పాంజలి ఘటించారు కేసీఆర్‌. ఆ తర్వాత, జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్‌. అనంతరం, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఎస్పీ ఛాంబర్‌లోకెళ్లి జిల్లా పోలీస్‌ హెడ్‌ సృజనను కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎస్పీ కార్యాలయం ప్రారంభం
జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభోత్సవం చేశారు. మొదట కార్యాలయానికి చేరుకున్న సీఎంకు హోంమంత్రి మహమూద్‌ అలీ, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌, డీజీపీ అంజనీకుమార్‌తో పాటు పోలీసు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎంకు పోలీస్‌ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యాలయ శిలాఫలకాన్ని ప్రారంభించారు. కార్యాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎస్పీ చాంబర్‌లో జిల్లా పోలీస్‌ అధికారి సృజనను కూర్చోబెట్టి.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అంత్యక్రియలలో పాల్గోన్న మంత్రి కేటీఆర్.

ఇదిలా ఉండగా.. గద్వాల జిల్లా పోలీస్‌ కార్యాలయ సముదాయాన్ని ప్రభుత్వం రూ.38.50 కోట్లతో నిర్మించింది. కార్యాలయంలో సిబ్బంది విధులు నిర్వహించేందుకు నాలుగు ఫోర్లు, 45 గదులు, సమీక్ష సమావేశాల కోసం కాన్ఫరెన్స్‌హాల్‌, ప్రత్యేక క్యాబిన్‌ ఏర్పాటు చేశారు. సాయుధ దళపతి కార్యాలయంతోపాటు ఆర్మ్‌డ్‌ సిబ్బంది ఉండేలా రెండు బరాక్‌లు నిర్మించారు. ల్యాబ్‌ సౌకర్యం, ఫోరెన్సిక్‌, సైబర్‌, క్లూస్‌టీం కోసం సైతం వసతులు కల్పించారు. డాగ్‌, బాంబ్‌ స్కాడ్‌ సిబ్బందికి వసతి కూడా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో సీఎస్‌ శాంతికుమారి, మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్‌ వల్లూరి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

 

గ‌ద్వాల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభం
జోగులాంబ గ‌ద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీని ముఖ్య‌మంత్రి కేసీఆర్ సోమ‌వారం సాయంత్రం ప్రారంభించారు. మొద‌ట తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పూల‌మాల వేశారు. అనంత‌రం పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. అనంత‌రం పండితుల వేద మంత్రోచ్ఛ‌ర‌ణాల మ‌ధ్య శిలాఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించి, రిబ్బ‌న్ క‌ట్ చేసి పార్టీ కార్యాల‌యాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా గ‌ద్వాల్ జిల్లా పార్టీ ఇంచార్జి బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి కుర్చీలో కూర్చోబెట్టారు కేసీఆర్.ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి, అంబ్ర‌హం, ఆల వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, అంజయ్య యాద‌వ్, శాట్స్ చైర్మ‌న్ ఆంజ‌నేయులు గౌడ్‌తో పాటు ప‌లువురు ప్రజా ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie