సీఎం కేసీఆర్ ఒక హంతకుడని.. ఒకేరోజు ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడు. వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.
సీఎం కేసీఆర్ ఒక హంతకుడని.. ఒకేరోజు ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. డిగ్రీ చదివి నాలుగేళ్లయినా ఉద్యోగం రాక శివకుమార్ ఉరి వేసుకున్నాడన్నారు. 20 రోజులైనా వడ్లకు కాంటాలు వేయక రైతు యల్లయ్య గుండె ఆగిందన్నారు. 15రోజులుగా సమ్మె చేస్తున్నా.. సర్కారు స్పందించక జీపీ కార్యదర్శి సోనీ తనువు చాలించిందని షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసుకుంటున్నా.. కేసీఆర్ దొరకు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉందన్నారు.
జేపీఎస్‌లను చర్చలకు పిలిచే ప్రసక్తే లేదు: సీఎస్.
కొలువులు లేక పుట్టెడు దు:ఖంతో యువత ఉందన్నారు.వడ్లు కొనక కన్నీటి వ్యధతో రైతులున్నారని షర్మిల పేర్కొన్నారు. ‘‘ఉద్యోగ భరోసా లేక మనస్తాపంతో కార్యదర్శులు.. చచ్చిపోతున్నా కనికరించవా కేసీఆర్? ఇంకెంతమంది ఉసురు తీసుకుంటావ్? నీ కుటుంబానికి పదవులు కావాలె! మా బిడ్డలకు ఉద్యోగాలు వద్దా? నీ కుటుంబం ఆస్తులు సంపాదించుకోవాలె! మా రైతులు అప్పులు తీర్చుకోవద్దా? నీ కుటుంబం కోట్లకు పడగలెత్తాలె! మా బిడ్డలు పాడె ఎక్కాల్నా? ఇంకా నువ్ ఎందుకు బతికున్నట్టు కేసీఆర్? బంగారు తెలంగాణ పేరుతో ఆత్మహత్యల తెలంగాణగా మార్చావు కదా?’’ అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.