Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

టిడ్కో ఇళ్లతో ప్రజల్లో ఆనందం.

0

రాష్ట్రంలోని అతిపెద్ద టిడ్కో లే అవుట్లలో ఒకటైన కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ పరిధిలోని మల్లాయపాలెంలో 77 ఎకరాల్లో నిర్మించిన 8,912 టిడ్కో ఇళ్లను సీఎం జగన్ ప్రారంభించారు. మరో 178.63 ఎకరాల్లో సిద్ధం చేసిన 7,728 మందికి ఇళ్ల పట్టాలు, కడుతున్న 4,500 ఇళ్లకు పట్టాలను కూడా నేడు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,43,600 మంది లబ్ధిదారులకు 300 చ.అ. టిడ్కో ఇళ్లను ప్రభుత్వం కేవలం రూపాయికే అన్ని హక్కులతో అందజేస్తోంది. టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించడానికి ముందుగా అక్కడే ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. మల్లాయపాలెం టిడ్కో లే అవుట్‌లోని టిడ్కో ఇళ్ల మధ్య నుంచి సీఎం రోడ్ షో కొనసాగింది. రోడ్ షోలో సీఎంకు అపూర్వ స్వాగతం పలికారు వైసీపీ శ్రేణులు.

 

దారిపొడవునా పూల వర్షం కురిపించారు. తమ సొంతింటి కల నెరవేర్చిన సీఎం జగన్‌కు గుడివాడ జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్‌, మాజీ మంత్రి కొడాలి నాని, పేర్ని నాని,  ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్ బాబు, వల్లభనేని వంశీ పాల్గొన్నారు. 16,601 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి టిడ్కో ఇళ్లు ఇచ్చామన్నారు జగన్. టీడీపీ మాత్రం ఆ ఇళ్ల పేరుతో 3 లక్షల రూపాయలు ప్రజలపై భారం వేసిందని గుర్తు చేశారు. ఇది ఇరవై ఏళ్లు ఉండేలా చేసిందన్నారు.

ఏపీలో ఏం జరుగుతోంది.. అర్ధం కాని రహస్య భేటీ..

ఇందులో చంద్రబాబు చేసిందేంటని ప్రశ్నించారు. చంద్రబాబు గుమస్తాగిరి కూడా సరిగా చేయలేదని ఎద్దేవా చేశారు. గుడివాడలో పేదలకు చంద్రబాబు ఒక్క సెంటు స్థలం, ఇళ్లు కూడా ఇవ్వలేదన్న్నారు సీఎం జగన్. 8,659 ఇళ్లకు అదనంగా జూలై 7న మరో 4,200 ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో 30.68 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల జగనన్న కాలనీలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. వీటి వెలువ రూ.2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie