సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పరిధిలోని.. చింతలపాలెం మండలం, తమ్మారం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గత కొంతకాలంగా.. బీఅరెస్ పార్టీ స్ధానిక సర్పంచ్ నర్సిరెడ్డి, ఎంపిటీసీ మోహన్ రెడ్డి రెండు వర్గాలుగా చీలిపోయారు. తాజాగా.. తిరుపతమ్మ జాతర సందర్బంగా.. అమ్మ వారి ఊరేగింపు లో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఒకరికి కత్తి పొట్లు తగిలాయి. పలువురికి గాయాలు అయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకుని, క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గ్రామoలో గొడవలు గాకుండా చూస్తున్నారు. గ్రామంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.