విజయవాడ: పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిద్రురు గ్రామంలో జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మ దినోత్సవం సందర్భంగా బ్యానర్లు కడుతుండగా వైసిపి నాయకులు అడ్డుకున్నారు. తమ నాయకుడు ఫ్లెక్సీలు కట్టుకుoటుంటే అడ్డుకోవడానికి మీరెవ్వరు అంటూ జనసైనికులు ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పారు. అధికారపార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ ఏకపక్షంగా పోలీసులు వ్యవహరిస్తున్నరని జనసైనికులు ఆరోపించారు.
janasena vs YCP, vijayawada ycp vs janasena, pawankalyan birthday, flexy war in Vijayawada
Prev Post
Next Post