అంగన్వాడీ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శేభారాణి,సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి.శివరాం, మండల,పట్టణ అధ్యక్షులు పి. రామాంజనేయులు,ఎన్, శ్రీకాంత్ డిమాండ్ చేశారు. స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం దగ్గర అంగన్వాడి వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండల కార్యదర్శి ఎన్.కె.నాగలక్ష్మి అధ్యక్షతన ధర్నా కార్యక్రమం నిర్వహించారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతానన్న జగన్మోహన్ రెడ్డి గారి హామీని నెరవేర్చాలని,ఐసిడిఎస్ ను పరిరక్షించాలని, అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత
కల్పించాలని,పెన్షన్,పిఎఫ్, ఇఎస్ఐ,రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు,వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని, అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని,హెల్పర్ల ప్రమోషన్ కు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలని, ప్రమోషన్లలో రాజకీయ జోక్యం అరికట్టాలని,300 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని,వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలని,సర్వీస్ లో ఉండి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, బీమా అమలు చేయాలని, లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలని, ఆయిల్,కందిపప్పు క్వాంటిటీ పెంచాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల పెట్రోల్,డీజిల్, గ్యాస్,నిత్యవసర వస్తువుల ధరలు అనేక రెట్లు పెరిగాయని, కానీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలను మాత్రం పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం 2018 లో అంగన్వాడి వర్కర్లకు 1500, హెల్పర్లకు 750, మినీ వర్కర్ కు 1250 పెంచుతున్నామని ప్రకటన చేసిందని కానీ ఇంతవరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017 నుండి టిఏ బిల్లులు ఇవ్వడం లేదని,2022 ఏప్రిల్ 25న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగన్వాడీలకు సమాన పనికి సమాన వేతనం,గ్రాట్యూటీ అమలు చేయాలని
నాగ్ పూర్ లో గులాబీ నేతకు ఘన స్వాగతం.
చెప్పినా ఇంతవరకు అమలు చేయలేదని,రకరకాల యాప్ లు తెచ్చి పని భారం మాత్రం భారీగా పెంచుతున్నారని ఎద్దేవా చేశారు.సెంటర్ల నిర్వహణకు పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితికి అంగన్వాడీలు నెట్టబడ్డారని,అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షణ పేరుతో ఫుడ్ కమిషనర్,ఎం ఎస్ కె, ఎమ్మార్వో,ఎండిఓ,రాజకీయ నాయకులు ఇలా అనేకమంది విజిట్ ల పేరుతో అవమానిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారన్నారు.ప్రకాశం జిల్లా టంగుటూరు ప్రాజెక్టులోని హనుమాయమ్మ ను రాజకీయ కక్షలతో నిర్ధాక్షిణ్యంగా చంపడమే దీనికి నిదర్శనం అన్నారు.
కనీసం మట్టి ఖర్చులు ఇచ్చే దిక్కు కూడా లేదని ఈ నేపథ్యంలో అంగన్వాడీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ దశల వారీ ఆందోళనా కార్యక్రమాలలో భాగంగా జూలై 10,11వ తేదీలలో అఖిల భారత కోర్కెల దినం సందర్భంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.అనంతరం సీనియర్ అసిస్టెంట్ ఈశ్వరయ్య గారికి కోర్కెలతో కూడిన మెమోరాండం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు షమీం బేగం,గౌసియా,మా దేవి అంగన్వాడి యూనియన్ నాయకురాలు గుల్జార్ బి, నాగలక్ష్మి,మేరీ,రాజేశ్వరి, వరలక్ష్మి 60 మందికి పైగా అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.