Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

బాలల హక్కుల పరిరక్షణ యోధుడు..  వై లక్ష్మణరావు కి డాక్టరేట్ అవార్డు..

0

బాలల హక్కుల పరిరక్షణ యోధుడు   వై లక్ష్మణరావు కి డాక్టరేట్ అవార్డు అందుకున్నారు
ఇంటర్నేషనల్ ఆనరోరి డాక్టరేట్ అవార్డు మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ ఏ బి ఎం.కె వరప్రసాద్ వైశ్యాన్సులర్ ఆఫ్ డబ్ల్యూహెచ్ యు అమెరికా డాక్టర్ రామకృష్ణ షా అమెరికా డాక్టర్ రఘు డాక్టర్ చక్రవర్తి ల చేతులమీదుగా బహుకరించినారు. యన్మన్ బెట్ల గ్రామము కొల్లాపూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో జన్మించారు విద్యార్థి ఉద్యమాలలో క్రియాశీలక భూమిక పోషించి పాలమూరు జిల్లా అనగానే వలస కార్మికుల జిల్లాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరుగాంచినది. కొల్లాపూర్ ప్రాంతము సామాజికంగా భౌగోళికంగా ఎంతో వెనుకబడిన ప్రాంతం ఆదివాసులైన చెంచు తెగలు అనేక పెంటలు ఉన్నాయి.

 

వారినిచూసి చెల్లించి పోయిన లక్ష్మణ్ రావు ఈ ప్రాంత అభివృద్ధి పైన మరియు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పైన ప్రజా చైతన్య కార్యక్రమాలు వ్యవసాయ కార్మిక చైతన్య కార్యక్రమాలు చేయాలని తలంపుతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని మామిడిపూడి వెంకట రంగయ్య ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలో చేరి బాల కార్మికుల పైన బాలల హక్కుల పైన పనిచేస్తూ ఎంతోమంది బాలలకు వెట్టిచాకిరి నుండి విముక్తి కల్పించారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయుటకు ఏప్రిల్ 1992 సంవత్సరములో సామాజిక అవగాహన కలిగిన కొంతమంది మిత్రుల ద్వారా శ్రామిక వికాస కేంద్రం స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు.

 

ఈ సంస్థ ద్వారా కొన్ని వేల మంది బాల కార్మికులను బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించి వారు ఉన్నత చదువులు చదువుకునే విధంగా ప్రోత్సహిస్తూ ఎన్నోవేల మందికి దిక్సూచి అయినారు. మహబూబ్ నగర్ జిల్లాలో గాని రాష్ట్రంలో గాని బాలల హక్కులు అనగానే వై లక్ష్మణరావు  గుర్తుకొస్తారు అదేవిధంగా  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బాలల హక్కుల పరిరక్షణ కొరకు చైల్డ్ రైట్ అండ్ యు క్రై బెంగళూరు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏర్పాటు అయిన బాలల హక్కుల ప్రజా ధ్వని అనే రాష్ట్రస్థాయి నెట్ వర్క్ కి వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగుతూ సుమారు 800

మజీద్ లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు..

స్వచ్ఛంద సంస్థల ద్వారా బాలల కుల పరిరక్షణ కొరకై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఎందరి ద్వారానో పేరు మన్ననలు పొందినారు. ఈ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ వెనుకబడిన ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ  యువతను అన్ని రంగాలలో ముందు ఉండేటట్లు చైతన్యం చేశారు అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన  తర్వాత బాలల హక్కుల ప్రజా ధ్వని సంస్థకు గౌరవ అధ్యక్షులుగా కొనసాగుతూ బాలల సంక్షేమ కమిటీ నాగర్ కర్నూలు జిల్లా చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు. అవార్డు అందించిన యూనివర్సిటీ కి డాక్టర్ వై లక్ష్మణరావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie