కరీంనగర్ నగరంలో చిన్నారి కృతిక గత నెల 27న శ్రీహరి కాలనీలో తప్పిపోయింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాణాలతో తిరిగి రావాలని కలలుగన్న చిన్నారి తల్లిదండ్రుల ఆశలు అడియాశలు అయ్యాయి. గురువారం ఉదయం కరీంనగర్ లోని లక్ష్మీనగర్ డ్రైనేజిలో శవమై దొరికింది. పక్క ఇంట్లోకి ఆడుకొవాడానికి వెళ్ళిన కృతిక కనబడకుండా పోయింది.
ఇటివల కురిసిన బారీ వర్షాలతో వరద ఉద్ధృతి పెరిగి డ్రైనేజీలు పొంగిపొర్లాయి ఆ సమయం లోనే చిన్నారి డ్రైనేజీలో పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శాంతినగర్ నుండి లక్ష్మీనగర్ వరకి డ్రైనేజీలొ కొట్టుకు వచ్చిన కృతిక తల, చేయి భాగం లేకపోవడం చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.