మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్లో అనాధ పిల్లలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముచ్చటించారు. విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్ను మంగళవారం సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి సందర్శించారు. ఉదయం 10.10 గంటల నుంచి 10.40 వరకు అనాధ పిల్లలతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు.