అవినాశ్ రెడ్డి కేసులో సుప్రీం ఆర్డర్ విడుదల అయింది. సుప్రీం ఆర్డర్లో కీలక అంశాల ప్రస్తావన ఉంది. మొత్తం 11 పేజీలలో సుదీర్ఘమైన ఆర్డర్ ఇచ్చిన సీజేఐ ధర్మాసనం. అవినాశ్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరులో హైకోర్టు వైఖరిపై మండిపడ్డ సుప్రీం కోర్టు ధర్మాసనం. దర్యాప్తు దశలో హైకోర్టు జోక్యం అవాంఛనీయమన్న సుప్రీం ధర్మాసనం. హైకోర్టు ఉత్తర్వులు సీబీఐ దర్యాప్తును నీరుగార్చే విధంగా ఉన్నాయి.
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ పిటిషన్పై విచారణ Investigation on CBI petition in YS Viveka murder case
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ పిటిషన్పై విచారణ జరిగింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎర్ర గంగి రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సీబీఐ వాదన. బెయిల్ రద్దుకు బలమైన కారణాలు లేవని ఎర్ర గంగిరెడ్డి వాదన. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు.