- బ్బందుల్లో ప్రజలు
- పట్టించుకోని అధికారులు
పట్టణంలో పశువులు ప్రధాన రహదారులపై సంచరిస్తూ.., ప్రయాణీకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొంత మంది పశువుల యజమానులు ఇలా రోడ్డుపై వదిలేయడంతో రోడ్లపైనే సేద తీరుతున్నాయి. కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, డిపో ఏరియాలో పదుల సంఖ్యలో పశువులు రోడ్ల పై కూర్చుంటున్నాయి. పశువులు రోడ్డు పై ఉండడంతో పలుమార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇటీవల రోడ్లుపై సంచరిస్తున్న ఆవుదూడను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది గత కొద్ది రోజుల క్రితం బైక్ పై వెళుతున్న బార్య భర్త లకు ఆవు అడ్డు రావడంతో బ్రేక్ వేయగా క్రింద పడడంతో గాయాల పాలయ్యారు. మార్కెట్ ఏరియాలో మిగిలిపోయిన కూరగాయలు రోడ్ల వెంట పడడంతో ఆ ప్రాంతంలో కూడా పశువులు సంచరిస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడమే కాకుండా మార్కెట్ కు వచ్చే వారిపై కొమ్ములతో దాడి చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. సంబంధిత అధికారులు రోడ్ల పై సంచరిస్తున్న పశువుల యజమానులను గుర్తించి పశువులు రోడ్ల పై సంచరించకుండ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇబ్బందిగా ఉంది..సుంకేట విజయ్ బీజేవైఎం నాయకుడు.
నిత్యం రోడ్లపైన పశువుల సంచారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రాత్రి పగులు తేడా లేకుండా రోడ్లపైనే తిరుగుతున్నాయి. వాటి వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు వాహనాలు అదుపుతప్పి కింద పడుతున్నాం. తగిన చర్యలు తీసుకోవాలి…
మళ్లీ మళ్లీ వస్తున్నాయి.. వాహబ్ కూరగాయల వ్యాపారి.
రాత్రి వేళ ఈ పశువులు మార్కెట్ లో మా దుకాణాల ముందు పడుకుంటున్నాయి. ఎంత తోలినా మళ్లీ మళ్లీ ఇక్కడికే వస్తూ మా వ్యాపారాలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి.కూరగాయల బుట్టలు కింద పడేసి తింటున్నాయి. వారసంత రోజు జనం ఎక్కువగా ఉండడంతో జనం మధ్యలో నుండి పశువులు వెళుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి వాటిని రోడ్లపైకి రాకుండా అధికారులు యజమానులపైచర్యలు తీసుకోవాలి.
గోశాలకు తరలిస్తాం..మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్.
రోడ్ల మీద మార్కెట్ లో పశువులు సంచరిస్తూ ఇబ్బందులు కలిగిస్తున్నాయని తెలిసింది. వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం.పశువుల యజమానులను గుర్తించి నోటీస్ లు ఇస్తాం. వారం రోజుల్లోగా పశువులను వాటి యజమానులు తీసుకువెళ్లని పక్షంలో వాటిని గోశాలకు తరలిస్తాం.