Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కార్ల దొంగల అరెస్టు

0

జల్సాలకు అలువాటు పడి ఈజీ మనీ కోసం కార్లను కిరాయికి తీసుకొని వాటిని తనఖా పెటే ముఠాను పోలీసులు అరెస్టు చేసారు.  శాపూర్ నగర్ లోని బాలానగర్ డిసిపి కార్యాలయంలో బాలానగర్ డిసిపి శ్రీనివాస్  ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కార్లను కిరాయికి తీసుకొని వాటిలో ఉన్న జీపీఎస్  సిస్టమ్ ను తొలగించి, కార్లను మరో  పార్టీ వద్ద తాకట్టు పెట్టి అందినంత నగదుతో ఉడాయించే ముఠాను అరెష్ట్ చేసిన బాలానగర్ ఎస్వోటీ  మరియు సనత్ నగర్ పియస్ పోలీసులు.

ముఖ్యంగా ఈ ముఠా ఎస్ ఆర్ నగర్, సనత్ నగర్, జగద్గిరిగుట్ట, బాచుపల్లి పియస్ పరిధులలో కార్లను కిరాయికి తీసుకొని నేరానికి పాల్పడుతున్నారని పక్కా సమాచారంతో బాలానగర్ ఎస్వోటీ , సనత్ నగర్ పియస్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారని, ఇద్దరు నింధితులు ప్రవీణ్ కుమార్(39), మహమద్  ఓమర్(28) లను అదుపులోకి తీసుకొని వారి వద్దనుండి వివిద కపెనీలకు చెందిన 16కార్ల స్వాధీనం చేసుకున్నారని డిసిపి తెలిపారు. మరో నింధితుడు అహ్మద్ అలీ పరారీలో ఉన్నాడని తెలిపాడు. వీటి విలువ సుమారు కోటి పది లక్షలు(₹1,10,00,00/-) వరకు ఉంటుందని, ప్రజలు కార్లను కిరాయికి ఇచ్చేటప్పుడు అన్ని విధాలుగా అడ్రస్ ప్రూఫ్ లు చెక్ చోసుకొని ఇవ్వాలని  తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie