Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

నాణ్యత పై విజిలెన్స్ కు ఫిర్యాదు చేయండి

City Congress President Komati Reddy Narender Reddy

0

Cable Bridge Approach Road కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు నాణ్యత పై మంత్రి గంగుల కమలాకర్ విజిలెన్స్ కు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గొప్పగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి పై అనవసరంగా ప్రతి పక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మేయర్ సునీల్ రావు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. భారీ వర్షాలవల్ల నగరంలో చాలా ప్రాంతాల్లో ఇండ్లల్లోకి నీళ్ళు చేరాయని అన్నారు. బాధ్యతగల ప్రతిపక్షం పార్టీ నేతలుగా మీడియా ద్వారా సమస్యలు తెలియజేస్తే కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారని మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు కుంగలేదని కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాద్దాంతం చేస్తుందని అనడం సిగ్గు చేటన్నారు.

రోడ్లు భవనాల శాఖ ఈఈ ఇచ్చిన ప్రకటనలో రెండు మూడు సెంటి మీటర్లు మాత్రమే కుంగింది ఇది సహజం అని ఒక వర్షాకాలం పూర్తిగా చూసిన తర్వాత తారు వేస్తామని పేర్కొన్న తర్వాత కూడా ఎందుకు రాత్రికి రాత్రి మరమ్మతుల పనులు చేస్తున్నారని కోమటిరెడ్డి ప్రశ్నించారు. వాహనాలను ఎప్పటిలోగా అనుమతిస్తారో స్పష్టత ఇవ్వాలని, తాత్కాలిక మరమ్మతులు చేసి ఎన్నికల వరకు కేవలం చిన్న వాహనాలకు మాత్రమే అనుమతించి ప్రజల దృష్టి మళ్ళించాలని చూస్తున్నా రని అన్నారు. సమావేశంలో ఎండి తాజ్, కొరివి అరుణ్ కుమార్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, దండి రవీందర్,కుర్ర పోచయ్య, ఎండి చాంద్, దన్న సింగ్, షబానా మహమ్మద్, ఊరడి లత, ముల్కల కవిత, అన్నే జ్యోతి రెడ్డి, ముక్క భాస్కర్, చంద్రయ్య గౌడ్, సలిమోద్ధిన్, మామిడి సత్యనారాయణ రెడ్డి, కంకనాల అనిల్ కుమార్,మెతుకు కాంతయ్య, షేక్ శేహెన్ష, మహమ్మద్ భారీ, ఇమామ్, కీర్తి కుమార్, బషీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie