రైతులకు లక్ష రూపాయలు నగదు రుణ మాఫీ చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి బీఆరెస్ నేతలు క్షీరాభిషేఖం చేశారు. ఐబీ చౌరస్తా లో పాలభిషేఖం చేసిన అనంతరం ట్రాక్టర్ లతో పుర వీధుల గుండా ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా బీఆరెస్ నేతలు, రైతులు మాట్లాడుతూ, కేసీఆర్ రుణమాఫీ పథకం ఆచరణలో పెట్టడం అభినందనీయమని అన్నారు. రైతులకు ఆర్థికంగా కలిసొస్తుందన్నారు. ఇప్పటికే రైతుబందు అమలు చేస్తున్న కేసీఆర్ రుణమాఫీ చేయడం పట్ల రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోందని తెలిపారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, బీఆరెస్ నేత నడిపెళ్లి విజిత్ రావు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.