Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

జనన ధ్రువీకరణ పత్రాల కోసం లంచం

ACB officials caught VRO red handed

0

రెడ్ హ్యాండెడ్ గా వీఆర్వోను పట్టుకున్న ఏసీబీ అధికారులు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూరు విఆర్ఓ మాల్యాద్రిని లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. రావెళ్ల వెంకటేశ్వర్లు అనే రైతు నుండి తన ఇద్దరి కుమారుల బర్త్ సర్టిఫికెట్ కోసం లంచం తీసుకుంటూ ఉండగా ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం పట్టణంలోని ఓ బ్యాంకు సమీపంలో పదివేల రూపాయల లంచం ఇస్తూ ఉండగా వీఆర్వో మాల్యాద్రిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ డి.ఎస్.పి మోహన్ సిఐ ఆంజనేయులు రెడ్డి వారి బృందం.

ఈ సందర్భంగా రైతు వెంకటేశులు మాట్లాడుతూ తనను తమ గ్రామ విఆర్ఓ మాల్యాద్రి నానా ఇబ్బంది గురి చేస్తున్నాడని ప్రతి పనికి లంచం అడుగుతూ ఉంటాడని ఇదే క్రమంలో తన ఇద్దరు పిల్లల జనన ధ్రువీకరణ పత్రం  మంజూరు కొరకు 15000 రూపాయలు లంచం అడగగా అంత స్తోమత నా దగ్గర లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు వారి సహకారంతో ఈరోజు వీఆర్వోకు పదివేల రూపాయలు డబ్బులు ఆత్మకూరు పట్టణంలో అందజేస్తూ  అతన్ని పట్టించినట్టు రైతు తెలిపాడు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie