తెలంగాణ బీజేపీ నిరుద్యోగ మార్చ్‌కు ఏమైంది? కార్యక్రమాన్ని ప్రకటించి నెల రోజులు గడిచినా… కేవలం రెండు జిల్లాల్లోనే జరగడాన్ని ఎలా చూడాలి? అగ్ర నాయకత్వం పిలుపంటే… జిల్లాల్లోని స్థానిక నేతలకు లెక్క లేదా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అసలు తెలంగాణ కమలదళం మనసులో ఏముంది? లెట్స్‌వాచ్.టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని, నష్టపోయిన అభ్యర్థులకు తలో లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది తెలంగాణ బీజేపీ. ఇదే డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది.
అందులో భాగంగా… ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించాలని డిసైడ్ అయింది. ఆ విషయాన్ని ప్రకటించి నెల రోజులు దాటింది. ఏప్రిల్ మొదటి వారంలో కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నారు. కానీ…ఇంతవరకు జరగలేదు. వివిధ కారణాలతో ఆలస్యం అవుతోందని పార్టీ నేతలు చెబుతున్నా…ఫలానా కారణం అన్నది ఎవరికీ క్లారిటీ లేదట. అసలు ఆ క్లారిటీ ఇచ్చే నాయకులే కరవయ్యారట.ముందు అనుకున్న ప్రకారం ఏప్రిల్‌లో కేవలం రెండంటే రెండే… ఉమ్మడి వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కార్యక్రమాలు జరిగాయి.
మరి ఆ మిగతా 8 ఉమ్మడి జిల్లాల సంగతి ఏంటంటే మాత్రం ఎవరి దగ్గరా ఆన్సర్ లేదు. స్థానిక నేతల మధ్య సమన్వయం లేక పోవడం, పార్టీ వరుస కార్యక్రమాలు ఇవ్వడంతో ఊపిరి సలపని పనిలో ఉన్నారట. అదే టైంలో ఇంత పెద్ద ప్రోగ్రాం నిర్వహణ పై జంకుతున్నారట జిల్లాల బీజేపీ నాయకులు. పైగా ఒకదాని వెంబడి ఒకటిగా…కార్యక్రమాలు ఇవ్వడం మీదా విసుక్కుంటున్నారట. అన్నిటికీ మించి ఆర్థిక భారాన్ని మోయడానికి ఎక్కువ మంది సిద్ధంగా లేరన్నది అంతర్గతంగా అనుకుంటున్న మాట.
ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో చేతి చమురు వదిలించుకోవడం ఎందుకన్నది ఎక్కువ మంది ఆలోచనగా ఉందట. ఇవన్నీ కలగలిపి నిరుద్యోగ మార్చ్ నిర్వహణపై ఆసక్తి కనబరచడం లేదట ఎక్కువ మంది నాయకులు.అదిగో.. ఇగిదో అనుకునే లోపే… కర్ణాటక ఎన్నికలు రావడం, రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలు కూడా అక్కడ ప్రచారంలో పాల్గొనడంతో ఆ ప్రభావం కూడా నిరుద్యోగమార్చ్‌లపై పడిందట. పార్టీ కేంద్ర నాయకత్వం కూడా కర్నాటక ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నందున ముందు వాటి మీద దృష్టిపెట్టి… మీ సంగతి తర్వాత చూసుకోండని చెప్పిందట.
సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపికలో సీఎం కేసీఆర్ రూటు.
అసలు దగ్గరి నుంచే ఆ మాత్రం వెసులుబాటు వచ్చిన తర్వాత ఇక తగ్గడం ఎందుకన్నట్టు ప్రస్తుతానికి నిరుద్యోగ మార్చ్‌ను అటకెక్కించారట తెలంగాణ బీజేపీ నేతలు. ఈ నెల 10తో కర్నాటక ఎన్నికలు ముగుస్తాయి కాబట్టి…తర్వాత సంగారెడ్డిలో కార్యక్రమం ఉంటుందని అంటున్నారు కొందరు నేతలు. చూడాలి… అది ఎంతవరకు అమలవుతుందో. మొత్తంగా పార్టీ అగ్రనాయకత్వం ఇస్తున్న వరుస ప్రోగ్రామ్స్‌తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నామన్నది తెలంగాణ బీజేపీ నేతల మనోగతంగా ఉంది.