ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు వరదలలో గల్లంతయ్యారు.శనివారం చిట్యాల మండలంలో రెండు మృతదేహాలను గుర్తించగా మరో రెండు మృతదేహాల కోసం గాలింపు చర్యలు ముమ్మురంగా కొనసాగుతున్నాయి.
జిల్లా ఎస్పీ పుల్ల కరుణాకర్ డిఎస్పి రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కాటారం సిఐ రంజిత్ రావు, కొయ్యూరు ఎస్సై నరేష్ ల ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాల సహాయంతో మానేరు పరివాహక ప్రాంతంలో ముమ్మురంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. శనివారం తాడిచెర్ల మల్లారం పివి నగర్ వల్లెంకుంట వరకు మానేరు తీరంలో గాలింపు చర్యలు చేపట్టారు.మానేరు శివారు ప్రాంతాల్లో గుర్తుతెలియని మృతదేహాలను ఎవరైనా గమనిస్తే కొయ్యూరు పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై నరేష్ కోరారు.