పత్తికొండ: రానున్న 2024 ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడం తథ్యమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మంగళవారం పత్తికొండ పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో నిర్వహించిన. విలేకర్ల సమావేశం లో ఆయనమాట్లాడు తూ సాగునీటి ప్రాజెక్టులను, పరిశ్రమలను విస్మరించి రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి లేకుండ చేశారన్నారు. పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఉన్నా ఏర్పాటు చేయలేదన్నారు. రాష్ట్రంలో రూ. 8. 65కోట్లు మంజూరు చేసి హైవేరహదారులను నిర్మించామన్నారు. అన్ని రాష్ట్రాల్లో రాజధానులు ఏర్పాటు చేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం ఎలాంటి రాజధాని ఏర్పాటు చేయలేదన్నారు.పోలవరం తప్ప మిగతా ప్రాజెక్టులు వైసిపి, టిడిపి అధినేతలకు కనిపించవా అని ప్రశ్నించారు.
రాయలసీమ నుంచి ముఖ్య మంత్రులు ఉన్నా సీమ అభివృద్ధి మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. 2024లో బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 10వేల కోట్లు విడుదల చేసి రాయలసీమను అభివృద్ధి చేసి రతనాల సీమగా మారుస్తామన్నారు. జిల్లాలో హైకోర్టు ఏర్పాటుకు బిజెపి సానుకూలంగా ఉందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నగరూరు రాఘవేంద్ర, బిజెపి జిల్లా అధ్యక్షుడు రామస్వామి, బిజెపి పత్తికొండ ఇన్చార్జ్ రంజిత్ కర్ని, నియోజవర్గం ఇన్చార్జి రంగా గౌడ్, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండి మల్లికార్జున సీనియర్ నాయకులు పూనా మల్లికార్జున గోరంట్ల బ్రహ్మయ్య సిసి రంగన్న కర్ణం చంద్రన్న అడ్వకేట్ నగేష్ మిలిటరీ హుస్సేన్ బిజెపి మండల ఉపాధ్యక్షుడు పులికొండ బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు.