1;కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే
2;ఈనెల 30 నుండి జూన్ 30 వరకు మహా జన సంపర్క్ అభియాన్
3;తెలంగాణకు కేసీఆర్ మెయిన్ విలన్..కాంగ్రెస్, ఎంఐఎం సహ విలన్లు, కమ్యూనిస్టులు ఆకు
4;గెలవలేని చోట్ల కాంగ్రెస్ అభ్యర్ధులను ఎలక్షన్ ఫండ్ ఇస్తున్న కేసీఆర్
తెలంగాణలో కొలువులు కావాలంటే కమలం రావాల్సిందేననే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కేంద్రంతోపాటు రాష్ట్రంలో బీజేపీ ఉంటే తెలంగాణకు ఎంతో మేలు జరిగేదని.. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని డబుల్ ఇంజిన్ సర్కారుంటేనే తెలంగాణలో డబుల్ అభివ్రుద్ధి సాధ్యమనే అంశాన్ని గడపగడపకూ తీసుకెళ్లాలని కోరారు. అట్లాగే కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడంతోపాటు తెలంగాణకు చేకూర్చిన ప్రయోజనాలను ఇంటింటికీ తెలియజేసేందుకు ఈనెల 30 నుండి వచ్చే నెల 30 వరకు మహా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా9 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు జరిగిన ప్రయోజనాలను వివరించారు.
హైదరాబాద్ లోని చంపాపేటలో ఈ రోజు బండి సంజయ్ అధ్యక్షతన ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, డాక్టర్ లక్ష్మణ్, మధ్యప్రదేశ్ ఇంఛార్జీ మరళీధర్ రావు, జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, తెలంగాణ రాష్ట్ర సహ ఇంఛార్జీ అరవింద్ మీనన్, తమిళనాడు సహ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి, ఏపీ జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ కేవీఎన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అహర్నిశలు క్రుషి చేస్తున్న నాయకులు, కార్యకర్తలందరికీ అభినందనలు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కుంచుకోవడం తథ్యం. • కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలను గ్రామగ్రామాన, గడప గడపకూ చేర్చాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్నాం. ఈనెల 30 నుండి జూన్ 30 వరకు మహా జన సంపర్క్ అభియాన్ పేరుతో కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించామని అన్నారు.
దేశంతోపాటు తెలంగాణ అభివ్రుద్ధి కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం ఎంతో క్రుషి చేస్తున్నా కేసీఆర్ ప్రభుత్వ మూర్ఖత్వంతో అనుకున్న స్థాయిలో అభివ్రుద్ధి జరగడం లేదు. కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను, ఇస్తున్న నిధులను ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాం. మోదీ ప్రధాని 9 ఏళ్ల పాలనలో భారత్ విశ్వగురు స్థానానికి ఎదుగుతోంది. పేద కుటుంబం నుండి వచ్చిన మోదీకి పేదల కష్టాలను గుర్తించారు. వారి జీవితాల్లో మార్పుతో దేశ ప్రగతి సాధ్యమనే ఉద్దేశంతో పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.
గుజరాత్ లో రాత్రిపూట బయటకు వస్తే మహిళలు చెంబు పట్టుకుని బహిర్భుమికి వెళుతున్న ద్రుశ్యాన్ని చూసిన నరేంద్రమోదీ.. స్వచ్ఛ భారత్ పేరుతో టాయిలెట్ల నిర్మాణం చేపట్టారు. తెలంగాణ రాష్ట్రానికి 2 లక్షల 40 వేల ఇండ్లు మంజూరు చేశారు. మరో 5 లక్షల ఇండ్లను మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా… మంజూరైనవే కట్టలేక పేదలకు అందాల్సిన ఇండ్లను దక్కకుండా చేసిండు కేసీఆర్…దేశం మొత్తం 9 కోట్ల 50 లక్షల పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తే.. అందులో తెలంగాణ అడిగినన్ని కనెక్షన్లు ఇచ్చినారు. మొత్తం 11 లక్షల 50 వేల గ్యాస్ కనెక్షన్లు ఈ రాష్ట్రానికే ఇచ్చారు.
కోటి కుటుంబాలున్న తెలంగాణలో దాదాపు 30 లక్షల టాయిలెట్లు నిర్మించారు. అంటే ప్రతి మూడు కుటుంబాల్లో ఒకరికి మోదీ ప్రభుత్వం టాయిలెట్ నిర్మించింది. ఇది నా లెక్క కాదు.. రాష్ట్ర ప్రభుత్వ లెక్కలే… కోవిడ్ సమయంలో తిండిలేకుండా ఎవరూ పస్తులుండకూడదనే ఉద్దేశంతో 9 వేల కోట్ల రూపాయల విలువైన 25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పేదలకు ఉచితంగా పంపిణీ చేసిన ఘనత మోదీగారిదేనని అన్నారు.