Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

బీజేపీ నుండి జిట్టా అవుట్..!

office secretary B. Uma Shankar announced the suspension of BJP state executive committee member Jitta Balakrishna Reddy from the party

0
  • పార్టీ నుంచి సస్పెండ్​
  • వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
  • కాంగ్రెస్​ వైపు చూడటమే కారణమా..?

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జిట్టా బాలకృష్ణా రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్​చేస్తూ కార్యాలయ కార్యదర్శి బి. ఉమా శంకర్​ ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్​ ఉన్న సమయంలో జిట్టా బాలకృష్ణారెడ్డి తన పార్టీ యువ తెలంగాణను బీజేపీలో విలీనం చేసి, పార్టీ నేతలతో కలిసి కాషాయం కండువా కప్పుకున్నారు. కొంతకాలంగా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఇటీవల పార్టీతో సంబంధం లేకుండా భువనగిరిలో ధూం ధాం నిర్వహించి, పలు రాజకీయ పార్టీ నేతలను సైతం ఆహ్వానించారు.

ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీని వీడుతారనే ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఆయన కాంగ్రెస్​లో చేరుతారని కూడా టాక్​. ఈ నేపథ్యంలోనే పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినందుకు బీజేపీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్​చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సస్పెన్షన్​ తక్షణమే అమల్లోకి వస్తుందని, బుధవారం నుంచి వారం రోజుల్లోగా ఆయన ప్రవర్తనపై రాష్ట్ర పార్టీకి వివరణ ఇవ్వాలని సస్పెన్షన్​ లేఖలో పేర్కొన్నారు.

ఎందుకో మరి..?
జిట్టా బాలకృష్ణారెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగానే ఉంటున్నారు. అయితే, ఇటీవల రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆయన కాంగ్రెస్​లో చేరుతారని ప్రచారం జరుగుతున్నది. పార్టీలోని ఓ సీనియర్​ నేతతో సైతం ఆయన సన్నిహితంగా ఉంటున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్​ నుంచి కుంభం అనిల్​కుమార్​ రెడ్డి బీఆర్​ఎస్​లో చేరడంతో.. దీన్ని భర్తీ చేసేందుకు జిట్టా బాలకృష్ణారెడ్డిని కాంగ్రెస్​లోకి తీసుకువచ్చేందుకు పలువురు కీలక నేతలు ప్రయత్నాలు చేశారు. భువనగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు చాన్స్​ కూడా ఇస్తారనే ప్రచారం గాంధీభవన్​ వర్గాల్లో జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే బీజేపీ నుంచి జిట్టాను సస్పెండ్​ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie