అదిలాబాద్: బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ కొడుకు శరత్ను పోలీసులు బలవంతంగా జీపులో ఎక్కించుకొని టౌన్లో తిప్పడంతో అవమానంగా భావించిన ఆయన పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు య త్నించారు. పోలీసులకు, బీజేపీ కార్యకర్తలను నడుమ తోపులాట జరిగి టౌన్లో ఉద్రిక్తత నెల కొంది. అంబేద్కర్ జయంతి సందర్భంగాటౌన్లో నిర్వహించిన ర్యాలీలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీనిపై ఫిర్యాదు రావడంతో ఆదిలాబాద్ వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడులను నిరసిస్తూ హిందూ సంఘాలు సోమవారం బంద్కు పిలుపునిచ్చాయి. ఆదిలాబాద్ డీఎస్పీ ఉమేందర్ ప్రెస్మీట్ పెట్టి, గొడవకు పాయల్ శరత్ అనుచరుడే కారణమని అన్నారు. తన పేరు ఎందుకు తెచ్చారని అడిగేందుకు శరత్, పలువురు బీజేపీ లీడర్లు డీఎస్పీ దగ్గరకు వెళ్లారు. పోలీసులు శరత్ను జీపులోకి ఎక్కించి తీసుకెళ్లారు. శరత్ అనుచరులు జీపును వెంబడించారు. టౌన్లో తిప్పుకుంటూ వెళ్లిన పోలీసులు చివరికి హైవే దాకా తీసుకెళ్లారు. శరత్ అనుచరులు ఫా లో అవుతున్నారని తెలిసి ఇంటి వద్ద దింపారు. కావాలనే తనను బద్నాం చేస్తున్నారని మనస్తాపం చెందిన శరత్.. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.
బీజేపీ లీడర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరి గింది. బీఆర్ఎస్ లీడర్ల సూచనలతోనే తనకు అల్ల ర్లతో సంబంధం ఉన్నట్లు డీఎస్పీ ప్రెస్ మీట్లో మా ట్లాడి, బద్నాం చేశారని శరత్ ఆరోపించారు. రౌడీ షీట్ ఓపెన్ చేశామని, చెప్పినట్లు వినకుంటే పీడీ యాక్ట్ పెడ్తామని వార్నింగ్ ఇచ్చారన్నారు. ఆదిలాబాద్లో హిందూ సంఘాలు తలపెట్టిన బంద్ ను ఎట్టిపరిస్థి తుల్లో జరగనివ్వబోమని ఆదిలాబాద్ డీఎస్పీ ఉమేందర్ తెలిపారు. బంద్ పేరుతో చట్టాన్ని ఉల్లంఘిస్తే కేసులు పెడతామన్నారు.