బీజేపీ, బీఆర్ఎస్ డిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా ఉన్నాయని.. కవితను అరెస్ట్ చేయకపోవడం వల్లే బీజేపీ దూకుడు తగ్గిందని .. బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేయడమే మిగిలింది అనుకున్న సమయంలో మొత్తం ఒక్క సారిగా చల్లబడిపోయింది. అదే సమయంలో బీజేపీలో చేరికలు కూడా ఆగిపోయాయి. మరో వైపు కర్ణాటక ఎన్నికల్లో కేసీఆర్ ఏ మాత్రం జోక్యం చేసుకోలేదు. మహారాష్ట్రలో మాత్రం అదీ కూడా శివారు ప్రాంతాల్లో ఎక్కువ దృష్టి పెడుతున్నారు.
ఇదంతా బీజేపీకి మేలు చేయడానికేనన్న ప్రచారమూ ప్రారంభమైంది. ఇదంతా బీజేపీలో చేరికలు తగ్గిపోవడానికి.. ప్రజల్లో బీఆర్ఎస్,బీజేపీ ఒకటే అన్న అభిప్రాయాన్ని కల్పించడానికి కారణం అవుతున్నాయన్న ఆవేదన బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా బీజేపీలో చేరిన నేతల్లో అసంతృప్తి క్రమంగా బయటపడుతోంది. దేశ రాజకీయాలను ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతుందని భావించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కాస్త పాజ్ వచ్చింది.
ప్రత్యేక పారిశుద్ద్య కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలి,జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష
కల్వకుంట్ల కవిత కాలికి గాయం కావడంతో దాదాపుగా నెల రోజులుకపైగా బయట కనిపించలేదు. ఆమె గాయం నుంచి కోలుకుని కొండగట్టుకు వెళ్లి హనుమాన్ చాలీసా పాటించి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఆ తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గత నెలన్నర రోజుల్లోనే హవాలా కేసులో జైల్లో ఉన్న సుఖేష్. చంద్రశేఖర్ కవితకు డబ్బులు ఇచ్చినట్లుగా వాట్సాప్ చాట్స్ బయట పెట్టారు. అలాగే ఈడీ కూడా కవిత ఎంత డబ్బులు ఢిల్లీ లిక్కర్ స్కాం చేసి సంపాదించారో వాడితో ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారో కూడా కోర్టుకు అభియోగపత్రంలో తెలిపింది.
ఈ రెండూ అత్యంత కీలకమైన సాక్ష్యాలు అనుకోవచ్చు. కానీ అనూహ్యంగా ఈడీ, సీబీఐలు సైలెంట ్అయిపోయాయి. సుఖేష్ చంద్రశేఖర్ వాట్సాప్ చాట్‌లను బయట పెట్టినప్పుడు సోషల్ మీడియా ద్వారా స్పందించిన కవిత.. తనపై నిర్దిష్టమైన అభియోగాలు నమోదు చే్తూ ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌పై మాత్రం స్పందించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులు అందర్నీ ఈడీ, సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఒకరి తర్వాత ఒకరు కేసులు పెట్టారు. నెలల తరబడి నిందితులు జైల్లో ఉంటున్నారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న సిసోడియా పదవి కూడా పోగొట్టుకున్నారు. ఎన్నో సార్లు ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురయింది. గత నవంబర్ లో అరెస్ట్ చేసిన ఇద్దరికి రౌస్
అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత అరబిందో శరత్ చంద్రారెడ్డికి ఆయన భార్య అనారోగ్యం కారణంగా బెయిల్ ఇచ్చింది. అదే సమయంలో మాగుంట రాఘవకు బెయిల్ తిరస్కరించారు. కానీ కవితను మాత్రం అరెస్ట్ చేయలేదు. గతంలో ఈడీ కార్యాలయానికి పిలిచి నాలుగు సార్లు ప్రశ్నించారు.
ఆమె కు చెందిన పది ఫోన్లను తీసుకున్నారు. తర్వాత మళ్లీ పిలుస్తామని నోటీసులు ఇచ్చారు కానీ పిలువలేదు. అందర్నీ అరెస్ట్ చేసి కవితకు మాత్రమే ఎందుకు మినహాయింపు ఇచ్చారన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ మినహాయింపులో రాజకీయం ఉందన్న భావన అందుకే పెరుగుతోంది.కారణం ఏదైనా కేసీఆర్ బీజేపీపై దాడిని తగ్గించారు. అందర్నీ కలుపుకుని బీజేపీని ఓడిస్తానని పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ ప్రకటించారు.ఇప్పుడు ఎవర్నీ కలవడం లేదు. ఒక్క మహారాష్ట్ర శివారు ప్రాంతాలపై మాత్రమే దృష్టి పెట్టారు.
మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పైనే విమర్శలు గుప్పించారు. ఆయనా బయటకు రావడం లేదు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చక ముందే కేసీఆర్ పలు రాష్ట్రాల్లో పర్యటించారు. దేశ్ కీ నేత ఇమేజ్ కోసం ప్రయత్నించారు. అయితే అనూహ్యంగా పార్టీ ఏర్పాటు తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయారు. ఢిల్లీలో భారీ బహిరంగసభ పెట్టాలని అనుకున్నారు. కానీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కూడా సభ పెట్టడం లేదు.
గుండెంగ లో ఘనంగాఎమ్మెల్యే శంకర్ నాయక్ జన్మదిన వేడుకలు
తాత్కలిక ఆఫీసు ప్రారంభోత్సవం కోసం కలిసి వచ్చే నేతల్ని పిలిచినా.. ఇప్పుడు మాత్రం పెద్దగా ఎవర్నీ పిలవ లేదు. ఉదయం వెళ్లి మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేశారు. ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తు స్లో కావడం.. మరో వైపు బీజేపీ కేసీఆర్ దాడిని తగ్గించడంతో బీజేపీ, బీఆర్ఎస్ రాజీ చేసుకున్నాయా అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇది కేసీఆర్ ను ఓడించాలని బీజేపీలో చేరిన వారికి అసలు నచ్చడం లేదు. అందుకే ఆ పార్టీలో కొత్త సంక్షోభం ప్రారంభమయింది