Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్- గణేష్ ప్రోమో సాంగ్

Bhagwant Kesari First Single Ganesh Promo Song

0

ప్రీ-గణేష్ చతుర్థి వేడుకలు ప్రారంభమయ్యాయి, ‘భగవంత్ కేసరి’ మేకర్స్ గణేష్ సాంగ్ పాట ప్రోమోను విడుదల చేశారు. మాస్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, శ్రీలీల.. బాబాయ్, అమ్మాయిగా కనిపించారు. అనిల్ రావిపూడి ప్రతి సినిమాలో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. భగవంత్ కేసరిలో బాలకృష్ణ, శ్రీలీల బాబాయ్, అమ్మాయిగా కనిపించనున్నారు. వీరిద్దరి అనుబంధం గణేష్ సాంగ్ ప్రోమో ద్వారా రివిల్ అయ్యింది. బాలకృష్ణ, శ్రీలీల.. వారి మధ్య అందమైన కెమిస్ట్రీని చూడటం కన్నుల పండగలా వుంది.ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Bhagwant Kesari First Single Ganesh Promo Song

మాస్, తీన్మార్ నంబర్‌తో మ్యూజిక్ ప్రమోషన్‌లు ప్రారంభమయ్యాయి. ఈ పాట సెప్టెంబర్ 1న విడుదల కానుంది.షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. జాతీయ అవార్డు-విజేత అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు.దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్, శ్రీలీల.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie