Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఘనంగా భాగ్ సాలే సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం.

0

శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా భాగ్ సాలే. నేహా సోలంకి నాయికగా కనిపించనుంది. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో  క్రైమ్ కామెడీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జూలై 7న భాగ్ సాలే విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను హీరో కార్తికేయ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ నందినీ రాయ్ మాట్లాడుతూ – ఈ సినిమా, ఈ క్యారెక్టర్ నాకు చాలా చాలా స్పెషల్. నా కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

 

ఇలాంటి మంచి అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. కాలభైరవ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకు కంగ్రాట్స్ చెబుతున్నాం. జూలై 7 గుర్తుపెట్టుకోండి. మా సినిమాను థియేటర్ లో చూడండి. అని చెప్పింది.నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ – క్రైమ్ కామెడీ అనేది తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన జానర్. గతంలో మనీ మనీ, క్షణ క్షణం, బ్రోచేవారెవరురా, స్వామి రారా వంటి సినిమాలను విజయవంతం చేశారు. పాండమిక్ తర్వాత ఓ కొత్త జానర్ లో సినిమా చేయాలని అనుకుంటూ ఈ చిత్రాన్ని ప్రారంభించాం. కామెడీ సినిమాలు వస్తున్నాయి గానీ మంచి క్రైమ్ కామెడీలు రావడం లేదు. శ్రీ సింహాకు పేరు తెచ్చే సినిమా అవుతుంది. జూలై 7న సురేష్ డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాం. అన్నారు

సంగీత దర్శకుడు కాలభైరవ మాట్లాడుతూ – ఈ సినిమాకు వర్క్ చేస్తున్నప్పుడు మంచి ఫన్ తో ఎంటర్ టైనింగ్ గా రెండు గంటల సమయం సరదాగా తెలియకుండా గడిచిపోయింది. రేపు థియేటర్ లో ప్రేక్షకులకు కూడా ఇలాంటి అనుభూతే కలుగుతుందని ఆశిస్తున్నాం. ఈ ఫన్ ను మిస్ కావొద్దు. థియేటర్ కు వచ్చి చూడండి. అన్నారు దర్శకుడు ప్రణీత్ మాట్లాడుతూ – భాగ్ సాలే అనేది క్రేజీ సౌండింగ్. ఆ పేరులోనే ఫన్ క్రియేట్ అవుతుంది. ఈ మధ్య మేము విడుదల చేసిన వరల్డ్ ఆఫ్ భాగ్ సాలేకు అద్భుతమైన స్పందన వచ్చింది. అది చూశాక మాకు మరింత నమ్మకం వచ్చింది. ఇది పూర్తిగా హైదరాబాద్ బేస్డ్ మూవీ. సినిమా షూటింగ్ కూడా సికింద్రాబాద్, వారాసిగూడ, ఓల్డ్ సిటీలో జరిపాం. షూటింగ్ ప్రాసెస్ లో హీరో శ్రీ సింహాతో పాటు నిర్మాతలు అర్జున్, కళ్యాణ్ గార్లు బాగా సపోర్ట్ చేశారు. మంచి ఇరానీ ఛాయ్ లాంటి సినిమా మాది. అని చెప్పారు.

 

హీరో  శ్రీ సింహా కోడూరి మాట్లాడుతూ – ఈ చిత్రంలో నా పాత్ర పేరు అర్జున్. అతనో టక్కరి దొంగ. తను చేయాలనుకున్నవి చేసేసినట్లు కటింగ్ ఇస్తుంటాడు. తన పని అయ్యేలా చూసుకుంటాడు. విలువైన ఉంగరం దొరకడం వల్ల అర్జున్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా సక్సెస్ పట్ల నమ్మకంతో ఉన్నాం. అన్నారు.
హీరో కార్తికేయ మాట్లాడుతూ – భాగ్ సాలే ట్రైలర్ చూశాను. ఈ ట్రైలర్ చూశాక టైటిల్ బాగా సెట్టయింది అనిపించింది. చాలా ఎంటర్ టైనింగ్ గా సినిమా ఉంటుంది. సినిమాలోని అన్ని క్యారెక్టర్స్ ఎనర్జీతో ఉన్నాయి.

భారీ మేకింగ్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఆకట్టుకున్న ‘రుద్రంగి’ ట్రైలర్

ఇప్పటిదాకా భాగ్ సాలే అంటే మహేష్ పాట గుర్తుకొచ్చేది. ఇప్పుడీ సినిమా గుర్తుకొస్తుంది. తన ఇంట్లో ఎంతోమంది గొప్ప టెక్నీషియన్స్ ఉన్నా..శ్రీసింహా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతని సింప్లిసిటీ నాకు బాగా నచ్చుతుంది. ఈ సినిమా శ్రీ సింహాకు పెద్ద హిట్ కావాలి. అన్నారు. నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ – వరల్డ్ ఆఫ్ భాగ్ సాలే నాకు బాగా నచ్చింది. ఇలా కథను చెప్పడం ఆకట్టుకుంది. ప్రొడ్యూసర్ అర్జున్ అన్న నాకు మంచి ఫ్రెండ్. శ్రీ సింహా ఎంచుకునే కథలు ఇంప్రెస్ చేస్తుంటాయి. ఆయన డేట్స్ దొరక్కుంటే ఆ కథల్లో నటించాలని అనిపిస్తుంటుంది. ఈ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie