బేతంచర్ల, ఉదయం న్యూస్: ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి బేతంచర్ల మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసే కార్యక్రమంలో భాగంగా బేతంచెర్ల మండలంలోని కనుమకింది కొట్టాల గ్రామంలో వెలసిన బిల్వ సర్గం గుహలలో చేపట్టిన ప్రహరీ పనులను పరిశీలించేందుకు బుధవారం నాడు పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా అక్కడున్న తేనెటీగల గుంపు దాడి చేయడంతో రెవిన్యూ సిబ్బంది, జర్నలిస్టులు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు దాదాపుగా 40 మంది గాయపడ్డారు.
ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు.
వీరిని బేతంచర్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కర్నూల్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. వీరిని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, నాగభూషణం రెడ్డి, ఎమ్మార్వో, ఆర్డీవోలు పరామర్శించారు. గత మూడు నెలల క్రితం కూడా ఇదే తరహాలో తినతిగల దాడి జరగడంతో అందులో దాదాపుగా పదిమంది తేనెటీగల దాడిలో గాయపడిన విషయం తెలిసిందే ఇది రెండోసారి కావడం విశేషం దీనిపై అధికారులు తగు జాగ్రత్త తీసుకోవాలని కోరుతున్నారు.