బండి సంజయ్ నేరాన్ని ఒప్పకున్నారు: వరంగల్ సీపీ రంగనాథ్
Bandi Sanjay has not confessed to the crime: Warangal CP Ranganath
టెన్త్ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ నేరాన్ని ఒప్పకున్నారని వరంగల్ సీపీ రంగనాథ్ చెప్పారు. టెన్త్ హిందీ పేపర్‌ను ప్రశాంత్ వైరల్ చేశాడని చెప్పారు. మాల్‌ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశామన్నారు. ప్రశాంత్, మహేశ్ ప్రశ్న పత్రాన్ని బండి సంజయ్‌కి పంపారు. ఆయనకు ఉదయం 11.24 గంటలకు ప్రశ్నప్రతం చేరింది.
ఏ 2 ప్రశాంత్ ఎమ్మెల్యే ఈటలకు 10.41 గంటలకు పంపాడు. ఉదయం 9.30 గంటలకే ప్రశ్నపత్రం లీకైనట్లు అసత్య ప్రచారం చేశారు. అరెస్టు సమయంలో బండి సంజయ్ తన దగ్గర ఫోన్లేదన్నారు. పేపర్ లీక్ కేసులో మరికొందరు కీలక సాక్షులను ప్రశ్నించాల్సి ఉంది. అనవసరంగా ఈ కేసులో ఇరికించాలనే ఉద్దేశం మాకు లేదు. బండి సంజయ్ అరెస్టుపై లోక్‌సభ స్పీకరుకు సమాచారం ఇచ్చామన్నారు.